అన్వేషించండి

పూజా హెగ్డేపై తప్పుడు కూతలు - అతడికి లీగల్ నోటీసులు పంపిన బుట్టబొమ్మ!

స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే.. సినీ క్రిటిక్ ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని ఉమైర్.. సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అంతే కాదు ప్లాఫ్ యాక్ట్రెస్ అంటూ హేళన చేశాడు.

Pooja Hegde : తనపై తప్పుడు పోస్టులు చేశాడని ఆరోపిస్తూ ప్రముఖ నటి పూజా హెగ్డే తాజాగా క్రిటిక్ ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు పంపింది. ఈ నోటీసులను చూపిస్తూ తాజాగా ఉమైర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు తనకు పూజా నోటీసులు పంపిందంటూ నవ్వుతూ తన వెటకారాన్ని ప్రదర్శించాడు. దీనికి తోడు ఫ్లాప్ యాక్ట్రెస్ అనే బిరుదునూ ప్రకటించాడు. ఇంతకీ అతను పూజాపై చేసిన కామెంట్స్ ఏంటీ..? ఎందుకు ఆమె అంతలా ఫైర్ అయింది..?

నేషనల్ మీడియాకే కాకుండా లోకల్ మీడియాకు బాగా పాపులర్ అయిన క్రిటిక్ ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుబాయి సెన్సార్ బోర్డ్ మెంబర్ ని అంటూ సినిమా రిలీజ్ కు ముందే రివ్యూలు చెప్పే అతనికి ఇక్కడ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు.. అదే రేంజ్ లో శత్రువులు కూడా ఉన్నారు. అందుకు కారణం రివ్యూలు ఇవ్వటమేనని అందరికీ తెలుసు. రివ్యూల పేరుతో ఎవరో ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ పై నోటికొచ్చి వాగుతూ వార్తల్లో నిలవడం అతనికి సర్వసాధారణమే. అంతే కాదు అన్నీ కళ్లతో చూసినట్లు అందరికీ ఎఫైర్స్ అంటగడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తూంటాడు. ఎప్పుడూ ఎవరో ఒకర సెలబ్రిటీలను టార్గెట్ చేయడం.. వారి గురించి వారి పర్సనల్ విషయాల గురించి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటుంటాడు.

ఈ క్రమంలోనే ఇటీవల స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపైనా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్నాడు ఉమైర్ సంధు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఉమైర్ సంధు రీసెంట్ గా ట్వీట్ చేశారు. పూజా గత రెండు వారాలుగా తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని.. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఉమైర్ సంధు తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాదు ఈ సమయంలోనే కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఆమెను కాపాడాకలిగారని కూడా ఉమైర్ చెప్పడం అందర్నీ షాక్ కు గురి చేసింది. దీంతో ఉమైర్ చేసిన ట్వీట్ పై పూజా హెగ్డే అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీకు వేరే పనిలేదా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నావా అని అతన్ని విమర్శించారు. మరికొందరు పూజా మధ్యాహ్నం తన ఫోటోల్ని కూడా షేర్ చేసిందని ఆధారాలు కూడా చూపెట్టారు.  

ఇదిలా ఉండగా ఉమైర్ సంధు కాంట్రవర్శియల్ ట్వీట్ పై స్పందించిన పూజా హెగ్డే టీమ్.. తాజాగా అతనికి లీగల్ నోటీసులు పంపింది. అయితే వాటిని కూడా అతను గర్వంగా తన ట్విట్టర్ లో పెట్టుకుని మురిసి పోతున్నాడు.  అంటే తనను ఎవరూ ఏమీ చేయగలరు అన్నట్లు సోషల్ మీడియా పోస్ట్ చేసి మరీ తన ధోరణిని నిరూపించుకుంటున్నాడు. వేరే దేశంలో ఉండి ఇలా ట్వీట్స్ చేస్తూ.. లీగల్ గా దొరకనని చెప్తున్నట్లుగా ఉంది అతని వైఖరి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అంతకు ముందు హీరో అక్కినేని అఖిల్, ఊర్వశి రౌతేలా ను హెరాస్ చేశాడని ఆమెను ఇబ్బంది పెట్టాడంటూ సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసాడు ఉమైర్. ఏజెంట్ సినిమా ఐటెం సాంగ్ షూట్ సమయంలో అఖిల్.. ఊర్వశిని ఏడిపించాడని, ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని, ఊర్వశి కూడా అతనితో వర్క్ చేయడం నచ్చలేదని, అతను ఇబ్బంది పెట్టాడని చెప్పినట్లు ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్తా అప్పట్లో వైరల్ గా మారింది. ఆమె కూడా ఆ ట్వీట్ పై స్పందించి లీగల్ నోటీస్ పంపినట్టు సమాచారం.

Read Also : Tamannaah: తమన్నా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద ఖరీదైన డైమండ్ - అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget