HHVM Trailer - వీరమల్లు ట్రైలర్: ఏడుసార్లు చూసిన పవన్... విపరీతంగా నచ్చడంతో త్రివిక్రమ్‌కు ఫోన్ చేసి మరీ!
Hari Hara Veera Mallu Trailer: 'హరిహర వీరమల్లు' ట్రైలర్‌ను మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్ సహా దర్శక నిర్మాతలు చూశారు. టైలర్ విపరీతంగా నచ్చడంతో గురూజీకి పవన్ ఫోన్ చేసి పిలిపించారని తెలిసింది.

'హరిహర వీరమల్లు' ట్రైలర్ విడుదలకు రెండు రోజుల ముందు ఫైనల్ కట్ రెడీ అయింది. జూలై 3 (గురువారం) ఉదయం 11:10 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నారు. అయితే... మంగళవారం రాత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ట్రైలర్ చూపించారు.
ఆనంద్ సాయితో వెళ్లిన పవన్...
నచ్చడంతో వెంటనే గురూజీకి ఫోన్!
వీరమల్లు ట్రైలర్ చూడడం కోసం తన స్నేహితుడు, కళా దర్శకుడు ఆనంద్ సాయితో కలిసి అన్నపూర్ణ స్టూడియో (డీఐ)కి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ట్రైలర్ విపరీతంగా నచ్చడంతో ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారని చిత్ర బృందంతో పాటు అన్నపూర్ణలో ఉన్న జనాలు చెప్పారు.
వీరమల్లు ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే తన ఆప్త మిత్రుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)కి ఫోన్ చేసి రమ్మని పిలిచారట. ఆ తర్వాత మళ్ళీ గురూజీతో కలిసి ట్రైలర్ చూశారు. మొత్తం మీద బ్యాక్ టు బ్యాక్ ఏడుసార్లు హరిహర వీరమల్లు ట్రైలర్ పవన్ కళ్యాణ్ చూసినట్లు తెలిసింది.
నువ్వు చాలా బాగా కష్టపడ్డావ్...
దర్శకుడు జ్యోతి కృష్ణకు ప్రశంస!
Pawan Kalyan appreciates director Jyothi Krishna after watching HHVM Trailer: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన 'హరిహర వీరమల్లు'ను పూర్తి చేసే బాధ్యతను చిత్ర నిర్మాత ఏయం రత్నం తనయుడు, యువ దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే. అతని దర్శకత్వంలో సినిమా పూర్తి అయ్యింది. విజువల్ ఎఫెక్ట్ వర్క్స్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వరకు ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారు జ్యోతి కృష్ణ.
జ్యోతి కృష్ణ పడిన కష్టానికి పవన్ కళ్యాణ్ నుంచి ప్రశంసలు లభించాయి. 'నువ్వు చాలా బాగా కష్టపడ్డావ్' అంటూ ట్రైలర్ చూసిన తర్వాత అతడిని అభినందించారు పవర్ స్టార్. ఆయన ఎగ్జైట్ అయ్యారని తెలియడంతో వీరమల్లు ట్రైలర్ మీద అంచనాలు మరింత పెరిగాయి.
Also Read: చిరంజీవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా మహేష్ బాబు... అదీ ఒరిజినల్ ప్లాన్... తర్వాత ఏం జరిగిందంటే?
That’s a POWER PACKED VERDICT 🎯🦅
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 2, 2025
The force behind the storm @PawanKalyan has watched the trailer And even he couldn’t hold back the excitement 🤩❤️🔥🔥#PawanKalyan garu’s thunderous reaction sets the tone and it’s going to be euphoric tomorrow ⚔️⚔️#HariHaraVeeraMallu… pic.twitter.com/5AeAwJTR4v
హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలోని విమల్ థియేటర్‌లో 'హరిహర వీరమల్లు' ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుంది. దీనికి టాలీవుడ్ మీడియా హాజరు కానుంది. అలాగే అభిమానుల కోసం ఏపీ, తెలంగాణలోని ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ట్రైలర్ ప్లే చేయనున్నారు.
Also Read: 'తమ్ముడు'కు ముందు... పవన్ కళ్యాణ్ టైటిల్స్ వాడిన హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏమిటి?
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. మొఘల్ వంశస్థులు, రాజ్యాన్ని పరిపాలించిన ఔరంగజేబుగా ఆయన కనిపించనున్నారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహీతో పాటు పలువురు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా (Hari Hara Veera Mallu Release Date) జూలై 24న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.





















