అన్వేషించండి

Akira Nandan: తెలుగు పాటలు వింటూ జిమ్‌లో అకిరా వర్కౌట్స్ - కొడుకును చూసి మురిసిపోతున్న రేణూ దేశాయ్!

పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ జిమ్ లో కష్టపడతూ కనిపించాడు. తెలుగు పాటలు వింటూ వర్కౌట్స్ చేసే వీడియోను తల్లి రేణూ దేశాయ్ ఇన్ స్టాలో షేర్ చేసింది. కొడుకును చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.

అకీరా నందన్. పవణ్ కల్యాణ్, రేణూ దేశాయ్ ముద్దుల కొడుకు. బయట చాలా తక్కువగా కనిపిస్తాడు. మెగా ఫ్యామిలీలో జరిగే ఆయా వేడుకలు, కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తుంటాడు. తల్లి అకీరాను కొంగు చాటు కొడుకుగా పెంచుతోంది. అయితే, అకీరా ఎక్కవ కనిపించినా సోషల్ మీడియాలో ఇట్టే వార్తలు వైరల్ అవుతాయి. ఆయన ఫోటోలు ట్రెండింగ్ లోకి వస్తాయి. అకీరా ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు? సినిమాలు ఇష్టం లేకపోతే ఏం చేస్తాడు? అని తెగ చర్చలు నడుస్తాయి. నిజానికి చాలా కాలంగా అకీరా సినిమాల్లోకి వస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తల్లి రేణూ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో ఆయన నటించాడు. ఆయన నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే సినిమాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.

అకీరాను చూస్తుంటే గర్వంగా ఉంది- రేణు

కాసేపు ఆయన సినిమాల విషయం పక్కన పెడితే, మరోసారి అకీరా నెట్టింట్లో వైరల్ అవుతున్నాడు. తాజాగా జిమ్ లో పాటలు వింటూ వర్కౌట్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను తల్లి రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేకాదు, తెలుగు పాటలు వింటున్న అకీరాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. ఈ కాలం యువత కూడా మాతృభాషను గౌరవిస్తారని ఆశిస్తున్నానని రేణూ క్యాప్షన్ పెట్టింది. “చాలా మంది జిమ్ చేసే సమయంలో గట్టి గట్టిగా ఇంగ్లీష్ పాటలు పెట్టుకుని వింటుంటారు. కానీ, ఆ ట్రెండ్ కు బదులుగా జిమ్ చేసే సమయంలో తెలుగు పాటలు వినమని నేను ఎప్పుడూ అకీరాకు చెప్తుంటాను. నేను వర్కౌట్ చేసే సమయంలో మాత్రం హిందీలో పాటలను వింటుంటాను. అకీరా మాదిరిగానే యువ తరం వారి మాతృభాషలో పాటలు వినయడంతో పాటు ఆ భాషను కొనసాగించాలని కోరుకుంటున్నాను” అని  రేణూ దేశాయ్ రాసుకొచ్చారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

పవన్, రేణు- ప్రేమ, పెళ్లి, విడాకులు!

ఇక పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ లు సినిమా షూటింగ్ సందర్భంలో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల సహజీవనం తర్వాత వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలున్నారు.  కొన్నాళ్ల తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో  2012లో విడిపోయారు. అప్పటి నుంచీ ఎవరి లైఫ్ ను వాళ్లు గడుపుతున్నారు. ఈ మధ్య కాలంలో రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటుందీ అంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా కొంత మంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ పై ఆమె కూడా ఘాటుగానే స్పందించారు.  

Read Also: పంథానికి వస్తే అంతం చూస్తా- భీమ్ రావ్ దొరగా నటవిశ్వరూపం చూపించిన జగపతిబాబు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget