అన్వేషించండి

పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ 'తొలిప్రేమ' - రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన 'తొలిప్రేమ' మూవీని ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ వరుస పెట్టి రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ కూడా ఈ ట్రెండ్ కి ఇప్పుడు బాగా అలవాటు పడిపోయారు. అగ్ర హీరోల పాత హిట్ సినిమాలను ఇప్పుడు 4k అల్ట్రా HD వెర్షన్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలను చూసి ఫ్యాన్స్ థియేటర్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు 'పోకిరి', పవన్ కళ్యాణ్ 'జల్సా', అల్లు అర్జున్ 'దేశముదురు' రీసెంట్ గా ఎన్టీఆర్ 'సింహాద్రి' వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ని కనబరిచాయి.  ఇక ఈ కోవలోనే ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ'. ఈ సినిమా అప్పట్లో యూత్ కి తెగ నచ్చేసింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.

ప్రేమకథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన  ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించగా, పవన్ కి చెల్లెలిగా వాసుకి కీలక పాత్ర పోషించింది. వేణుమాధవ్, అలీ, రవిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవా సంగీతం అందించిన ఈ సినిమా 1998లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఆ రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ లో ఈ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. ఇక తాజాగా ఈ సినిమాని 4k రెజల్యూషన్ తో రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తొలిప్రేమ సినిమాను జూన్ 30, 2023న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మేకర్స్ రీరిలీజ్ ను ప్లాన్ చేశారు.

ఇక ఈ న్యూస్ తో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎప్పుడెప్పుడు 'తొలిప్రేమ' మూవీ ని 4k క్వాలిటీ లో చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తొలిప్రేమ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మూడో సినిమా. దీనికంటే ముందు 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి', 'గోకులంలో సీత', 'సుస్వాగతం' వంటి సినిమాలు చేశాడు పవన్. వీటిలో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' యావరేజ్ టాక్ ను రాబట్టినా.. ఆ తర్వాత వచ్చిన 'గోకులంలో సీత', 'సుస్వాగతం' సినిమాలు ఆడియన్స్ లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని పెంచాయి. ఇక 1998లో 'సుస్వాగతం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ అదే సంవత్సరం 'తొలిప్రేమ' సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ అందుకోవడం విశేషం. ఇప్పటికే పవన్ పవన్ కళ్యాణ్ గత సినిమాలు 'తమ్ముడు', 'ఖుషి', 'జల్సా' రీ రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ ని అందుకున్నాయి. మరి ఈ ఇప్పుడు 'తొలిప్రేమ' పవన్ గత సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Also Read: పదేళ్లు మాటల్లేవు, ఆ మూవీలోనే ప్రేమ పుట్టింది - తమ లవ్ స్టోరీ చెప్పిన నరేష్, పవిత్ర

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raakh Series OTT : ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
The Mummy OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ది మమ్మీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ది మమ్మీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Mareechika Review - మరీచిక రివ్యూ: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో రెజీనా, అనుపమ... సతీష్ కాసెట్టి సినిమా ఎలా ఉందంటే?
మరీచిక రివ్యూ: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో రెజీనా, అనుపమ... సతీష్ కాసెట్టి సినిమా ఎలా ఉందంటే?
Godari Gattupaina OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన - 3 వారాల్లోపే సడన్ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన - 3 వారాల్లోపే సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
Maruti Ethanol Car:పెట్రోల్‌కు కాలం చెల్లిందా? జూన్‌ 5న మారుతి
రూ. 4 ఖర్చు... 18 కిలోమీటర్ల మైలేజ్‌! మారుతి సుజుకి ఇథనాల్ కార్ వచ్చేస్తోంది... పూర్తి వివరాలు ఇవే!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Embed widget