OG Pre Release Event: పవన్ కల్యాణ్ 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ - ఆ నగరంలో వేడుక... ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?
OG Movie: పవన్ కల్యాణ్ అవెయిటెడ్ మూవీ 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలోని ప్రధాన నగరంలో చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Pawan Kalyan's OG Movie Pre Release Event Details: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హై యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్ లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు.
ఈవెంట్ ఎక్కడంటే?
'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో ఈ నెల 22న భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు పవన్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యే ఛాన్స్ ఉన్నందున విజయవాడ అయితే అన్ని విధాలా బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అడ్వాన్స్ బుకింగ్స్... అదుర్స్
మూవీ రిలీజ్ డేట్ కంటే 4 వారాల ముందే ఆగస్ట్ 29 నుంచి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది. నార్త్ అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ మార్క్ గ్రాస్ దాటేయగా దాదాపు 40 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రిలీజ్ టైంకు ఇవి మరింత ఎక్కువవుతుందని చెబుతున్నారు. పవర్ స్టార్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటుందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఈ నెల 24న ప్రీమియర్ షోస్ ప్రారంభం కానున్నాయి.
ఈ మూవీకి 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా... పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తుండగా... ప్రకాశ్ రాజ్, శ్రియ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్నారు. మూవీలో పవన్ ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 'సుమురాయ్' రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ పవర్ ఫుల్ ఎమోషనల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా మూవీ రూపొందుతుండగా... మ్యూజిక్ లెజెండ్ తమన్ బీజీఎం వేరే లెవల్‌లో ఉంది. 'ఓజాస్ గంభీర'గా పవన్ తన విశ్వరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
జపాన్ మ్యాజిక్ పరికరంతో..
పవర్ స్టార్ గ్రేస్‌కు తగ్గట్లుగా బీజీఎం కోసం పవన్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. జపాన్ వాయిద్య పరికరం కోటోను ఉపయోగించి తమన్ బీజీఎం క్రియేట్ చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను పంచుకోగా వైరల్ అవుతోంది. హాలీవుడ్ స్థాయిలో బీజీఎం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
#OgBgm
— thaman S (@MusicThaman) September 6, 2025
This instrument is calked Japanese ( koto )
Just tried With A violin Bow 🖤
Sounded this way 🤪🤯 pic.twitter.com/4xI3VE9Yyv






















