'ఓదెల రైల్వే స్టేషన్' దర్శకుడితో కేథరిన్ యాక్షన్ థ్రిల్లర్
డైరెక్షర్ అశోక్ తేజ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కేథరిన్ త్రెసా, సందీప్ మాధవ్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా.. జూలై చివరి వారంలో షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది..
Catherine Tresa : గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ సనిమా అప్పట్లో భారీ విజయాన్ని దక్కించుకుంది. తాజాగా దర్శకుడు అశోక్ తేజ మరో అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా కేథరిన్ థ్రెసా నటిస్తోంది. అయితే ఈ మూవీలో‘జార్జ్ రెడ్డి’, ‘వంగవీటి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్నాడు.
కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహావిష్ణు మూవీస్ బ్యానర్లపై రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం జూలై చివరి వారంలో షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ అండ్ సస్పెన్స్ సన్నివేశాలతో చివరి వరకూ క్లైమాక్స్ ఏంటో రివీల్ కాకుండా ‘ఓదెల రైల్వేస్టేషన్’ను అశోక్ తేజ టై స్క్రీన్‌ప్లేతో రక్తికట్టించారు. అదే తరహాలో, ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీని తెరెకెక్కిస్తాడని చిత్ర నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఈ సందర్భంగా నిర్మాతలు చెప్పారు.
మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో వచ్చిన సినిమాల్లో నటించిన కేథరిన్ త్రెసా.. 'గాడ్ ఫాదర్' సినిమాలో ఉపేంద్ర సరసన నటించింది. 2013లో కేథరీన్.. వరుణ్ సందేశ్ సరసన 'చమ్మక్ చల్లో' సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేయగా.. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో మూవీలోనూ నటించింది. అందం, అభినయం ఉన్నా సరే కేథరిన్ కు మాత్రం అర కొర సినీ అవకాశాలే రావడంతో కాస్త అసంతృప్తితోనే కాలం వెళ్లదీస్తోంది. మంచి హిట్ కోసం ఎంతో ఎదురుచూస్తోన్న కేథరిన్ కు ఈ మూవీ ప్లస్ అవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
ఇక గతేడాది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో రిలీజైన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాలో నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజిత పొన్నాడ లు నటించారు. ఈ మూవీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఓదెల రైల్వేస్టేషన్ మెప్పిస్తుంది. పాటలు, ఫైట్స్, హీరోయిజం లాంటి హంగులు లేకుండా కేవలం గంటన్నర నిడివిలోనే తెరకెక్కిన రియలిస్టిక్ సినిమా ఇది.
తెలుగులో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన హెబ్బాపటేల్.. ఈ సినిమాలో మాత్రం పూర్తి భిన్నంగా డీ గ్లామర్ క్యారెక్టర్‌లో కనిపించింది. యాక్టింగ్ పరంగా కొంత ఇంప్రూవ్ మెంట్ కనబరించగా.. ఈ మూవీ ఆమె కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ లో ఒకటిగా మిగిలిందని చెప్పవచ్చు. యువ ఐపీఎస్‌గా అనుదీప్ సహజ నటనతో ఆకట్టుకున్నాడు. పాజిటివ్, నెగెటివ్ రెండు షేడ్స్‌తో సాగే క్యారెక్టర్‌లో కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట సింహా నటన ఈ సినిమాకు పేరు రావడానికి మరో కారణంగా చెప్పవచ్చు.
Read Also : 90 సెకన్ల సునామీకి మీరు సిద్ధమేనా? 'సలార్' టీజర్‌పై అదిరిపోయే అప్‌డేట్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial