అన్వేషించండి

Devara : 'దేవర' షూటింగ్ నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్ - తారక్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఫిదా!

Devara : 'దేవర' షూటింగ్లో ఎన్టీఆర్ నడుచుకుంటూ వస్తున్న ఓ వీడియో క్లిప్ లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

NTR’s Leaked Video From Devara Set : ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ తమ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ షూటింగ్ సమయంలో మూవీ టీం కి లీకులు పెద్ద తలనొప్పిగా మారాయి. షూటింగ్ స్పాట్ నుంచి ఎవరో ఒకరు ఫోటోలు, వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. మొన్నటి వరకు 'గేమ్ చేంజర్', 'పుష్ప' వంటి సినిమాలు లీకుల బారిన పడగా.. ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' విషయంలోనూ అదే జరిగింది. తాజాగా 'దేవర' షూటింగ్ కి సంబంధించి ఎన్టీఆర్ వీడియో ఒకటి లీకై నెట్టింట హల్చల్ చేస్తోంది.

'దేవర' నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్

ఎన్టీఆర్, జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్లో జాన్వి కపూర్, ఎన్టీఆర్ లపై ఓ సాంగ్ తో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా గోవాలో సముద్రం దగ్గర షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వస్తున్న ఓ చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది. షూటింగ్ జరుగుతుండగా ఎవరో దాన్ని చాలా దూరంగా ఉన్న చెట్టు మీద నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇందులో ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వీడియోలో ఎన్టీఆర్ ఉంగరాల జుట్టుతో లుంగీ కట్టుకుని భుజం పై కండుగా కప్పుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీంతో ఈ వీడియోని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.


'దేవర' ఫస్ట్ సింగిల్ ఆరోజే

'దేవర' సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'దేవర' గ్లింప్స్ కి అనిరుద్ ఇచ్చిన బీజీయం నెక్స్ట్ లెవెల్ లో ఉండడంతో 'దేవర' సాంగ్స్ కోసం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే 'దేవర' ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అనౌన్స్మెంట్ రానుంది.


డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్

'దేవర' మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం ఓ హింట్ ఇచ్చి మరీ కన్ఫర్మ్ చేసింది. 'దేవర' రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్లో ఎన్టీఆర్ యంగ్ లుక్ లో కనిపించాడు. అంతేకాదు ఆ పోస్టర్ మీద 'దేవర' పేరులో 'వర' అని రెడ్ కలర్ థీమ్ ని హైలైట్ చేశారు. దీన్నిబట్టి సినిమాలో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా అలరించబోతున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అందులో మొదటి భాగం 'దేవర పార్ట్-1' దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది.

Also Read : ‘పుష్ప 2’ మేకర్స్‌పై అల్లు అర్జున్ సీరియస్ - కారణం అదేనా?

టాప్ హెడ్ లైన్స్

Nag Ashwin: 'కల్కి' క్లైమాక్స్‌పై విమర్శలు... రిప్లై ఇచ్చిన నాగ్ అశ్విన్ - నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు
'కల్కి' క్లైమాక్స్‌పై విమర్శలు... రిప్లై ఇచ్చిన నాగ్ అశ్విన్ - నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు
Tejaswini Nandamuri Latest Dance Video: సారంగదరియా పాటకు తేజస్విని నందమూరి డ్యాన్స్... సాయి పల్లవి రేంజ్‌లో బాలయ్య చిన్న కుమార్తె స్టెప్పులు
సారంగదరియా పాటకు తేజస్విని నందమూరి డ్యాన్స్... సాయి పల్లవి రేంజ్‌లో బాలయ్య చిన్న కుమార్తె స్టెప్పులు
Maa Inti Bangaram OTT: మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్... వంద కోట్లు కొల్లగొట్టిన సమంత సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్... వంద కోట్లు కొల్లగొట్టిన సమంత సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Lenin Box Office Collection Day 3: లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు
లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget