NTR Devara Update : ఎన్టీఆర్ 'దేవర'లో 'కెజిఎఫ్' నటుడికి ఛాన్స్ - అతడు ఎవరంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'దేవర' సినిమాలో కన్నడ నటుడు, 'కెజిఎఫ్'లో నటించిన ఒకరికి అవకాశం అందుకున్నారని తెలిసింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'దేవర' (Devara Movie). ఇటీవల హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అది ఆయన అభిమానులను, ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు వాళ్ళకు మరో అప్డేట్!
'దేవర'లో 'కెజిఎఫ్' నటుడు తారక్ పొన్నప్ప
కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన 'కెజిఎఫ్' సినిమా గుర్తు ఉందా? అందులో మాఫియా డాన్స్ బాస్ శెట్టి ఆండ్రూ సెక్రటరీ పాత్ర చేసిన తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) గుర్తు ఉన్నారా? . తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన 'సిఎస్ఐ సనాతన్' సినిమాలో కూడా ఆయన నటించారు. అతను ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.
'దేవర'లో తారక్ పొన్నప్ప క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ జరిగిన షూటింగులో ఆయన పాల్గొన్నారట. వచ్చే నెలలో స్టార్ట్ కాబోయే షెడ్యూల్ లో సైతం పాల్గొంటారట.
'దేవర'లో పవర్ ఫుల్ యాక్షన్!
ఎన్టీఆర్ అంటే యాక్షన్! సాధారణ యాక్షన్ సన్నివేశాన్ని సైతం తన నటనతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళతారు. ఇక, పవర్ ఫుల్ యాక్షన్ సీన్ అయితే ఆయన చెలరేగిపోతారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోసం ధీటైన యాక్షన్ ప్లాన్ చేశారట.
Also Read : 'మళ్ళీ పెళ్లి' రివ్యూ : నరేష్, పవిత్ర తప్పు చేశారా? లేదంటే రమ్యా రఘుపతిది తప్పా? ఏం చూపించారంటే?
ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై 'దేవర' సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.
'దేవర'లో మరో కన్నడ యాక్టర్!
'దేవర' సినిమాలో మరో కన్నడ యాక్టర్ ఉన్నారు. ఆవిడ పేరు చైత్రా రాయ్! 'అష్టా చమ్మా', 'దటీజ్ మహాలక్ష్మి', 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు' సీరియళ్లతో సందడి చేశారు. ప్రస్తుతం 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'రాధకు నీవేరా ప్రాణం'లో నటిస్తున్నారు. 'దేవర'లో సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో ఆమె నటిస్తున్నారు.
''ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్... ఇద్దరూ పెద్ద స్టార్లు! వాళ్ళను సిల్వర్ స్క్రీన్ మీద చూడటమే కానీ నేరుగా కలిసింది లేదు. తొలిసారి వాళ్ళను చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇద్దరు గొప్ప స్టార్లతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు ఇదొక వరం. నేను ఇంకా మేఘాల్లో తేలుతున్నాను'' అని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైత్ర రాయ్ పేర్కొన్నారు. సైఫ్ భార్య పాత్రలో నటిస్తున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
Also Read : 'మేమ్ ఫేమస్' రివ్యూ : 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' తర్వాత ఛాయ్ బిస్కెట్‌కు మరో హిట్టేనా?