అన్వేషించండి

Nivetha Thomas: నివేదా థామస్ పెళ్లంట - సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్, ఇంతకీ ఆమె ఏం చెప్పింది?

Nivetha Thomas: ఈరోజుల్లో చాలామంది యంగ్ హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుంటూ ఉండగా.. ఆ లిస్ట్‌లో నివేదా థామస్ కూడా యాడ్ అవ్వనుందని వార్తలు వచ్చాయి. కానీ ఒక్క పోస్ట్‌తో ఈ భామ క్లారిటీ ఇచ్చేసింది.

Nivetha Thomas: గ్లామర్‌కు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోవడంలో ఈతరం భామలు ముందున్నారు. అలాంటి వారిలో నివేదా థామస్ కూడా ఒకరు. అంతే కాకుండా చాలావరకు హీరోయిన్లు.. ఫ్యామిలీ వేరు, సినిమా వేరు అని భావించి త్వరగానే పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు. ఇప్పుడు నివేదా కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీనే కారణం. ఆ స్టోరీ చూసి నివేదా థామస్ పెళ్లి అంటూ సోషల్ మీడియా అంతా మారుమోగిపోయింది. దీంతో అసలు విషయం ఏంటో వెంటనే మరో స్టోరీతో క్లారిటీ ఇచ్చింది ఈ భామ.

సినిమాలు బంద్..

తమిళ, మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించింది నివేదా థామస్. మెల్లగా అక్కడే లీడ్ రోల్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇక చాలాకాలం పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లో తన సత్తా చాటుకున్న నివేదా.. నాని హీరోగా నటించిన ‘జెంటిల్‌మెన్’తో తెలుగులో కూడా హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగులోనే మంచి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. దీంతో నివేదా.. గ్లామర్ కంటే ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకోవడానికి ఇష్టపడుతుందని ప్రేక్షకులకు కూడా అర్థమయ్యింది. కానీ ఉన్నట్టుండి తను వెండితెరపై కనిపించడం ఆగిపోయింది.

రెండేళ్ల క్రితం..

తెలుగులో చివరిగా ‘శాకిని డాకిని’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించింది నివేదా థామస్. అందులో భయం లేని పోలీస్ ట్రైనీ పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా అందులో కామెడీ చేసి ప్రేక్షకులను నవ్వించింది కూడా. ఆ తర్వాత ఏమయ్యిందో తెలియదు.. నివేదా థామస్ తెలుగు సినిమాల్లో కనిపించడం ఆపేసింది. తెలుగు మాత్రమే కాదు.. ఇతర భాషల్లో కూడా తను పెద్దగా కనిపించలేదు. అంతే కాకుండా నివేదా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండే టైప్ కూడా కాదు. దీంతో అసలు నివేదా ఏమైపోయింది అని ఫ్యాన్స్ ఫీలయ్యారు. అదే సందర్భంలో తను ఒక్క పోస్ట్‌తో హాట్ టాపిక్‌గా మారింది.

అదీ మ్యాటర్..

‘చాలాకాలం అయ్యింది. కానీ ఫైనల్‌గా..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది నివేదా థామస్. దీనికి ఒక లవ్ ఎమోజీ కూడా యాడ్ చేయడంతో ఇది తన పెళ్లికి సంబంధించిన వార్తే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు విషయం అది కాదు.. తన అప్‌కమింగ్ తెలుగు మూవీ అప్డేట్‌కు సంబంధించిన స్టోరీ ఇది. రానా దగ్గుబాటి సమర్ఫణలో నివేదా పేతురాజ్ ఒక మూవీని సైన్ చేసింది. ‘చాలాకాలం వెయిట్ చేశారు. ఇది నా స్పెషల్ ఫిల్మ్’ అంటూ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను షేర్ చేసింది. ఇందులో నివేదాతో పాటు ప్రియదర్శి.. మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Also Read: ఆ సినిమాలో విశ్వక్ సేన్ ఉన్నాడని నాకు తెలియదు, సీక్వెల్‌పై క్లారిటీ లేదు - నివేదా పేతురాజ్

టాప్ హెడ్ లైన్స్

Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Embed widget