అన్వేషించండి

Bollywood Affairs: అప్పట్లో భయపడ్డాం... 25 ఏళ్ళకు ఎఫైర్ గురించి నోరు విప్పిన హీరోయిన్

Neelam Kothari On Govinda: బాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో గోవిందా - నీలం కొఠారి జంట ఒకటి. వాళ్లిద్దరూ 90వ దశకంలో కొన్ని సినిమాల్లో నటించారు. అప్పట్లో వాళ్ళ మధ్య ఎఫైర్ నడిచినట్టు పుకార్లు షికారు చేశారు.

బాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో గోవిందా (Govinda) - నీలం కొఠారి (Neelam Kothari) జంట ఒకటి. వాళ్లిద్దరూ 90వ దశకంలో కొన్ని సినిమాల్లో నటించారు. అప్పట్లో వాళ్ళ మధ్య ఎఫైర్ నడిచినట్టు పుకార్లు షికారు చేశారు. ఇటీవల గోవిందా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలతో వార్తల్లో నిలిచారు. ఒక వైపు ఆయన భార్య ఆరోపణలు చేస్తోంది. ఒక అమ్మాయితో తన భర్త పేరును ముడిపెడుతోంది. మరో వైపు గతంలో తమ మధ్య ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలపై నీలం కొఠారి తాజాగా స్పందించారు.

గోవిందాతో ఎఫైర్ ఉన్నట్టు వచ్చిన వాదనలు అన్నింటినీ నీలం కొఠారి తోసిపుచ్చారు. గోవిందా, తనకు మధ్య ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఉషా కాక్డే ప్రొడక్షన్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందాకు, తనకు ముడి పెడుతూ వచ్చిన వార్తలను ఆవిడ పూర్తిగా ఖండించారు. నీలం కొఠారి మాట్లాడుతూ... ''గోవిందా గారు చాలా మంచి వ్యక్తి. ఆయనకు, నాకు సంబంధం ఉన్నట్టు ఎవరు చెప్పారు? అది నిజం కాదు. ఆయన మంచి మనిషి. మేం చాలా హిట్ సినిమాలు చేశాం. కానీ పుకార్లు నిజం కాదు. మా మధ్య ఏమీ లేదు'' అని అన్నారు.

అప్పట్లో మేం మీడియాకు భయపడ్డాం

గోవిందాతో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తల గురించి నీలం కొఠారి మాట్లాడుతూ... ''నా అభిప్రాయం ప్రకారం... ఈ పుకార్లకు లింక్ - అప్ న్యూస్ కారణం. ఆ సమయంలో ఆ వార్తలకు ఎవరూ వివరణ ఇవ్వలేదు. దాంతో వాళ్ళు ఏం అనుకున్నారో... అదే రాశారు. నిజం చెప్పాలంటే... ఆ రోజుల్లో మేం మీడియాకు భయపడ్డాం. ఎందుకంటే... పెన్ పవర్ ఎక్కువ. ఎవరైనా రెండు మూడు సినిమాలు కలిసి చేస్తే... వాళ్ళ మధ్య ప్రేమ ఇతరత్రా వ్యవహారం నడిచిందని భావించేవారు'' అని అన్నారు.

Also Read: Pooja Hegde: బుట్ట బొమ్మకు మరో తెలుగు ఆఫర్... పవన్ 'ఓజీ' దర్శకుడి నెక్స్ట్ సినిమాలో!

Bollywood Affairs: అప్పట్లో భయపడ్డాం... 25 ఏళ్ళకు ఎఫైర్ గురించి నోరు విప్పిన హీరోయిన్

స్టార్‌డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీలం కొఠారి మీద గోవిందా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ... ''మేం చాలా సినిమాలు కలిసి చేశాం. మేం తరచూ కలుసుకునేవాళ్ళం. నీలం గురించి తెలుసుకున్న కొద్దీ ఆమెను ఇష్టపడ్డాను. ఎవరినైనా ప్రేమలో పడేసే మహిళ నీలం'' అని అన్నారు.

Also Readఇవాళ కోట్లకు అధిపతి... కానీ 33 ఏళ్ళు స్లమ్‌లో - డబ్బుల కోసం వేరుశనగలు అమ్మిన బాలీవుడ్ స్టార్

సునీతా అహుజాతో నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి గల కారణాన్ని కూడా గోవిందా వివరించారు. ఆయన మాట్లాడుతూ... ''నన్ను వదిలి వెళ్ళమని నేను సునీతాని అడిగాను. నేను ఆమెతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నా. కానీ, 5 రోజుల తర్వాత నన్ను పిలిచి నిశ్చితార్థం చేసుకోవాలని ఒప్పించకపోతే... బహుశా నీలంను పెళ్లి చేసుకునేవాడిని. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందులో ఏమీ తప్పు లేదని నేను అనుకుంటున్నాను'' అని అన్నారు.

Also ReadUrfi Javed: ఇస్లాం నుంచి నన్ను బహిష్కరించడానికి వాళ్ళెవరు? ఉర్ఫీ జావేద్ రియాక్షన్ విన్నారా?

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget