అన్వేషించండి

NBK109: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ - అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు బాబీ

NBK109: స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బాబీ, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా గురించి క్రేజీ అప్ డేట్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని డైక‌రెక్ట‌ర్ బాబీ స్వ‌యంగా ట్వీట్ చేశాడు.

NBK109 TITLE TEASER COMING SOON: నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ NBK109 సినిమా గురించి అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. నిజానికి సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అప్ డేట్స్ ఏవీ పెద్ద‌గా బ‌య‌టికి రాలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల బాల‌య్య‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు బాబీ. బాల‌య్య బాబుతో దిగిన ఫొటోను షేర్ చేసిన ఆయ‌న అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పాడు. 

కీలక సన్నివేశాలు పూర్తి.. 

బాబీ డైరెక్ష‌న్ లో బాల‌య్య త‌న 109వ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమాకి ఇప్ప‌టికీ టైటిల్ ని మాత్రం ఖ‌రారు చేయ‌లేదు. అయితే ఆ సినిమాకి సంబంధించి ముఖ్య‌మైన షూటింగ్ పూర్త‌య్యింది అట‌. ఈ విష‌యాన్ని చెప్తూ బాబీ ట్వీట్ చేశాడు. బాల‌య్య బాబుతో సెట్స్ లో దిగిన ఫొటోల‌ను షేర్ చేసిన బాబీ.. "ఒక ముఖ్య‌మైన షెడ్యూల్ ని పూర్తి చేశాం. జైపూర్ లో షూటింగ్ ముగించుకున్నాం. నంద‌మూరి బాల‌కృష్ణ గారిపై షూటింగ్ జ‌రిగింది. ఆయ‌న ఎన‌ర్జీకి ఎవ్వ‌రూ మ్యాచ్ కాలేరు. ఈ ఎలక్ట్రిఫైయింగ్ సీక్వెన్స్‌లలో బాల‌కృష్ణ గారి ఆవేశాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి. టైటిల్ టీజ‌ర్ త్వ‌ర‌లోనే రాబోతుంది" అని చెప్పి ఫైర్ ఎమోజీల‌ను జోడించాడు బాబీ. బాల‌య్య బాబుతో దిగిన ఫొటోల‌ను కూడా ట్వీట్ చేశారు. 

ఆక‌ట్టుకున్న గ్లింప్స్.. 

బాలకృష్ణ కెరీర్‌లో 109వ సినిమాగా తెరకెక్కుతుంది ఈ సినిమా. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాని సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. కాగా.. ఇటీవ‌ల జూన్ లో బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేసింది సినిమా టీమ్. అది బాల‌య్య బాబు అభిమానులను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ‘‘దేవుడు చాలా మంచోడయ్యా. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు. వీళ్లు అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ.. ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు’’ అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొద‌లైంది. చివర్లో అప్పుడే ట్రైన్ నుంచి దిగిన బాలకృష్ణ.. పొగ మధ్య నుంచి నడుచుకుంటూ వస్తాడు. ఆ త‌ర్వాత గుర్రంపై గ‌ర్జిస్తూ క‌నిపిస్తాడు బాల‌య్య‌. 

బిజీబిజీగా బాల‌య్య‌.. 

బాల‌య్య బాబు ఇటు సినీ, రాజ‌కీయాల్లో బిజీబిజీగా గ‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన విష‌యం తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమా షూటింగ్ లు. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లోనే బాల‌య్య బాబు హోస్ట్ చేసిన అన్ స్టాప‌బుల్ నాలుగో సీజ‌న్ కూడా ప్రారంభం కాబోతుంది. ద‌స‌రాకి అన్ స్టాప‌బుల్ 4వ సీజ‌న్ ని ప్రారంభం కాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4కు సంబంధించి ఆహా ఇప్పటికే ప్రకటన చేసింది. త్వరలోనే ఆహా సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించింది. అయితే, ఎప్పుడ‌నే విష‌యం మాత్రం తెలీదు.

Also Read: విడాకుల వార్త‌ల‌పై స్పందించిన అభిషేక్ బ‌చ్చ‌న్.. చివరికి అలా చెప్పుకోవల్సి వస్తోంది

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : మనుషులను పీక్కు తినే దెయ్యం - ఓటీటీ ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
మనుషులను పీక్కు తినే దెయ్యం - ఓటీటీ ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Rajinikanth Nayanthara : రజనీ కాంత్‌ కొత్త మూవీలో నయనతార - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
రజనీ కాంత్‌ కొత్త మూవీలో నయనతార - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Kamal Haasan Movies OTT : కమల్ హాసన్ మూవీస్‌కు బిగ్గెస్ట్ డిజిటల్ డీల్! - సెట్స్‌పై ఉండగానే ఒకే ఓటీటీకి ఆ మూడు సినిమాల రైట్స్
కమల్ హాసన్ మూవీస్‌కు బిగ్గెస్ట్ డిజిటల్ డీల్! - సెట్స్‌పై ఉండగానే ఒకే ఓటీటీకి ఆ మూడు సినిమాల రైట్స్

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Paying e-challan online: ట్రాఫిక్‌ చలాన్‌ కట్టకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయండి!
మీ బండిపై ట్రాఫిక్‌ చలాన్‌ ఉందో, లేదో మీకు తెలుసా? మీ ఫోన్‌లోనే చెక్‌ చేయవచ్చు!
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Late-Night Eating : రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Tragic Incident in MP: మధ్యప్రదేశ్‌లో విషాదం.. బాల్కనీలో గుట్కా ఉమ్మివేస్తే.. విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి!
మధ్యప్రదేశ్‌లో విషాదం.. బాల్కనీలో గుట్కా ఉమ్మివేస్తే.. విద్యుత్ షాక్‌తో వృద్ధుడు మృతి!
Embed widget