అన్వేషించండి

మేము హ్యాపీగా ఉన్నాం, త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా: నరేష్

నరేష్ పవిత్ర లోకేష్ జంటగా 'మళ్లీ పెళ్లి' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నరేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నరేష్, పవిత్ర లోకేష్. ఈ జోడి కి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అన్ని ఇన్ని కావు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే నరేష్, పవిత్ర లోకేష్ జంటగా 'మళ్లీ పెళ్లి' అనే సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి గతంలో నరేష్ కొన్ని ఫోటోలను, పెళ్లి వీడియోలను షేర్ చేసి ప్రేక్షకుల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచాడు. ఇక ఈ సినిమాని ఎమ్.ఎస్. రాజు డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

చాలామంది ఈ మూవీ ట్రైలర్ చూసి ఇది నరేష్ బయోపిక్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాని కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని భాషల్లో ఈ సినిమా ప్రమోషన్స్ ని మూవీ టీం ప్లాన్ చేసింది.  ప్రస్తుతం నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే వరుస ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న నరేష్..  ఈ ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత పవిత్ర లోకేష్ ని నరేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఇదే విషయంపై 'మళ్లీ పెళ్లి' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా క్లారిటీ ఇచ్చాడు నరేష్. త్వరలోనే పవిత్ర లోకేష్ ను తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ బాంబు పేల్చాడు.

తాజాగా కన్నడ ప్రెస్ మీట్ లో భాగంగా నరేష్ మాట్లాడుతూ.. "నిజానికి పెళ్లి అనేది కచ్చితంగా అవసరం లేదు. చాలామంది ఇష్టం లేకుండా సమాజం కోసం పెళ్లి అనే బంధం లో ఉంటున్నారు. అలాంటి వాళ్ల కోసమే ఈ సినిమా. పెళ్లి అంటే తాళిబొట్టు, మెట్టెలు కాదు. అవి కేవలం సంకేతాలు మాత్రమే. పెళ్లి అంటే రెండు హృదయాలు కలవడం. నాకు పవిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ మా మనసులు కలిశాయి. అందుకే మేము కలిసి హ్యాపీగా ఉంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాం. అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ సినిమా నా బయోపిక్ అని అందరు అనుకుంటున్నారు. కానీ ఇది నా బయోపిక్ కాదు. ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేయకండి. సినిమా చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది" అంటూ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు నరేష్. ఇక విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. మే 26న ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: 'ఏజెంట్' ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా - అందుబాటులోకి వచ్చేది అప్పుడే!

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget