అన్వేషించండి

Narasimha Naidu: 'నరసింహ నాయుడు' కథ మారిందని తెలుసా? బాలయ్య కాదు... అసలు కథలో హీరో ఎవరంటే?

Nandamuri Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో 'నరసింహ నాయుడు' ఒకటి. ఈ సినిమా కథ మారయిందని, అందులో మొదటి హీరో వేరే వాళ్ళు అని తెలుసా?

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఇమేజ్ ను ఒక్కసారిగా టాప్ గేర్ లోకి తీసుకెళ్లిన సినిమా 'నరసింహ నాయుడు'. జనవరి 11, 2001న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యాక్షన్ సినిమాలకు ఉన్న సత్తా చాటింది. ఏకంగా 105 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమా గా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా విజయం తరువాత నెక్స్ట్ 5ఏళ్ళు తెలుగు తెరపై ఫ్యాక్షన్ సినిమాలు రాజ్యం చేసాయి. ఈ సినిమా కన్నా ముందు 'ప్రేమించుకుందాం రా ', 'సమర సింహా రెడ్డి ' లాంటి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన సూపర్ హిట్స్ ఉన్నా 'నరసింహ నాయుడు' రేంజ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. 2000 సంవత్సరం తరువాత మారుతున్న కొత్త తరానికి బాలయ్య స్టామినాను పరిచయం చేసిన సినిమాగా నరసింహ నాయుడు ని చెప్పాలి. అయితే ఈ సినిమాకు ముందు అనుకున్న కథ ఇది కాదని తెలుసా?

పోసాని రాసిన సిన్సియర్ పోలీస్ కథ 
'సమర సింహా రెడ్డి' లాంటి కమ్ బ్యాక్ బ్లాక్ బస్టర్ లాంటి సినిమా తరువాత బాలకృష్ణ చేసిన సినిమాలు కమర్శియల్ గా పెద్దగా కలిసి రాలేదు. సుల్తాన్, కృష్ణ బాబు, వంశోద్దారకుడు, గొప్పింటి అల్లుడు లాంటి సినిమాలు యావరేజ్ లేదా ఫ్లాప్ అన్నట్టు రిజల్ట్ ఇచ్చాయి. దానితో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి మళ్ళీ తన రేంజ్ ఏంటో చూపాలి అనుకున్న బాలకృష్ణకు అప్పటికి ఫుల్ ఫామ్ లో ఉన్న స్టార్ రైటర్ పోసాని కృష్ణ మురళి ఒక కథ వినిపించారు.అది ఆయనకు నచ్చడంతో మూవీ ఓకే అయింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ముహూర్తపు షాట్ కూడా తీశారు. అయితే ఈలోపు రైటర్ చిన్ని కృష్ణ రాసిన 'బలి దేవుడి' కథ పరుచూరి బ్రదర్స్ కు నచ్చడం తో డైరెక్టర్ బి. గోపాల్ తో కలిసి బాలకృష్ణ కు ఇది బాగా సూట్ అవుతుందని వినిపించారు. బాలయ్య ఈ కథను డెవలప్ చేయమని చెప్పడంతో 'కత్తులతో కాదురా... కంటి చూపు తో చంపేస్తా' లాంటి పవర్ ఫుల్ డైలాగులతో సినిమా రెడీ అయింది. అదే 'నరసింహ నాయుడు'.

Also Read: Alelle Alelle Song Lyrics - 'అలెల్లె అలెల్లె' లిరిక్స్... ట్రెండింగ్‌లో మహేష్ బాబు అన్న కొడుకు సినిమా 'శ్రీనివాస మంగాపురం'లో సాంగ్ - జీవీ సంగీతంలో శ్రీమణి ఏం రాశారంటే?

సినిమాలో ముందుగా సౌందర్య, సిమ్రాన్‌లను హీరోయిన్లుగా అనుకున్నా సౌందర్య డేట్స్ కుదరక పోవడంతో ఆమె పాత్రను సిమ్రాన్‌కు, ఇచ్చి సిమ్రాన్ కోసం ముందు అనుకున్న పాత్రలోకి ప్రీతి జింగానియాని తీసుకున్నారు. ఆషా శైని ఒక ముఖ్యమైన పాత్రలో, ఒక పాటలో నటించారు. బాలీవుడ్ లో సహాయక పాత్రలు వేస్తున్న ముఖేష్ రిషి ని మెయిన్ విలన్ గా పరిచయం చేస్తూ తీసిన నరసింహ నాయుడు 2001 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయింది. దీనితో పాటే రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి 'మృగరాజు' అంచనాలు అందుకోలేకపోతే విక్టరీ వెంకటేష్ 'దేవీ పుత్రుడు' మాత్రం పరవాలేదనిపించుకుంది. ఈ మూడు సినిమాలకు మణి శర్మ నే మ్యూజిక్ డైరెక్టర్ కావడం అవన్నీ మ్యూజికల్ హిట్స్ కావడం విశేషం.

మరి పోసాని కథ ఏమైంది?
పోసాని కథతో ప్రారంభమై ఆగిపోయిన బాలయ్య బాబు సినిమా కూడా మరో పేరుతో మరో హీరోతో వచ్చింది. అదే 'అయోధ్య రామయ్య'. ఈ సినిమా షూటింగ్ 'నరసింహ నాయుడు' కంటే లేట్ గా ప్రారంభం అయినా రిలీజ్ మాత్రం దానికంటే ముందే అయింది. రియల్ స్టార్ శ్రీ హరి హీరోగా వచ్చిన 'అయోధ్య రామయ్య' హిట్ కావడమే కాకుండా శ్రీ హరికి నటుడిగా మంచి పేరు తెచ్చింది. 

Also ReadKara Review In Telugu - ధనుష్ 'కర' రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… సినిమా ఎలా ఉందంటే?

కొంతమంది రాజకీయ నాయకుల వల్ల ద్రోహిగా ముద్రపడి చనిపోయిన పోలీస్ ను నిర్దోషి గా నిరూపించే కొడుకు కథ 'అయోధ్య రామయ్య. తండ్రి కొడుకులు గా రెండు పాత్రాలలోనూ శ్రీహరి నటించాడు. చంద్ర మహేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మాటలు కూడా పోసానే రాశారు. ఆయన ఒక పాత్రలో కూడా నటించారు. ఇప్పటికీ సోషల్ మీడియా లో పోసాని పాత్ర డైలాగ్స్ వైరల్ అవుతుంటాయి. ఈ సినిమాకు ముందు అనుకున్న పేరు 'కరీంనగర్ యాదగిరి'. తరువాత దానిని 'అయోధ్య రామయ్య'గా మార్చారు. ఒక రచయిత కథతో ప్రారంభమై మరొక రచయిత కథతో వచ్చిన 'నరసింహ నాయుడు', మొదటి కథతో వచ్చిన 'అయోధ్య రామయ్య' రెండూ అప్పటికి బాలకృష్ణ, శ్రీహరికి బిగ్గెస్ట్ హిట్స్ గా మారడం విశేషమనే చెప్పాలి.

Also ReadAmmoru Diginadhi Song Lyrics - 'అమ్మోరు దిగినాది' సాంగ్ లిరిక్స్: 'అనకాపల్లి'లో మంగ్లీ పాట... జాతరలో మార్మోగేలా

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget