ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు అధికారులు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.