నాని 'సవారీ' తెగకు చెందిన 'జడల్' పాత్రను పోషించారు. తన సమాజ గుర్తింపు కోసం పోరాడే యోధుడిగా కనిపిస్తారు. ఈ తెగ ప్రభుత్వ రికార్డుల్లో ఉండదు.
Paradise First Review - ప్యారడైజ్ ఫస్ట్ రివ్యూ: మదర్ సెంటిమెంట్ సూపర్... అదరగొట్టిన నాని - సినిమా ఎలా ఉందంటే?
Nani Paradise Review In Telugu: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో 'దసరా' విజయం తర్వాత తెరకెక్కిన సినిమా 'ది ప్యారడైజ్'. ఈ మూవీ ఎలా ఉందో ఫస్ట్ రివ్యూలో చూడండి.

- నాని సవారీ తెగ యోధునిగా గుర్తింపు కోసం పోరాటం చేశాడు.
- యాక్షన్ వెనుక తల్లి సెంటిమెంట్ కథాంశానికి బలం చేకూర్చింది.
- నాని, మోహన్ బాబు నటనలు, దర్శకుడి టేకింగ్ ఆకట్టుకున్నాయి.
- 1985 నాటి కథలో ఎన్టీఆర్, కేసీఆర్ పాత్రలు కొద్దిసేపు కనిపిస్తాయి.
నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise Movie). 'దసరా' విజయం తర్వాత మరోసారి నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన చిత్రమిది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి. పాటలతో తోడు నాని జడల్ లుక్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. నాని కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించే దిశగా సినిమా వెళుతుంది. మరి, సినిమా ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూలో తెలుసుకోండి.
సవారీగా అదరగొట్టిన నాని
'ది ప్యారడైజ్' కోసం ఓ ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అందులో సవారీ అనే తెగ ఉంటుంది. వాళ్ళకు ఎటువంటి గుర్తింపు ఉండదు. ఆ సవారీలు (పురుషులు) జడలు వేసుకుని ఉంటారు. సవారీల్లో ఎవరినైనా చంపేస్తే కేసులు కూడా ఉండవు. ఎందుకంటే... జనాభా లెక్కల్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఏ విధమైన ప్రభుత్వ రికార్డుల్లో ఉండరు. అటువంటి ఓ సవారీ పాత్రను నాని ఈ సినిమాలో పోషించారు. తమ కమ్యూనిటీ గుర్తింపు కోసం పోరాడిన యోధుడిగా 'జడల్' పాత్రలో నాని అదరగొట్టారని తెలిసింది. నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చూడొచ్చని చెబుతున్నారు.
మదర్ సెంటిమెంట్ కీలకం!
ఇప్పటి వరకు 'ది ప్యారడైజ్' నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. కానీ, ఇందులో యాక్షన్ కంటే ఎక్కువ మదర్ సెంటిమెంట్ ఉంది. ఆ యాక్షన్ డ్రైవ్ వెనుక కీలకమైనది తల్లి క్యారెక్టర్. హీరో నాని తల్లి పాత్రలో బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి నటించారు. ఇంటర్వెల్ ముందు సోనాలి, నాని మధ్య సన్నివేశాలు అందరి చేత క్లాప్స్ కొట్టించేలా వచ్చాయని తెలిసింది.
ఇంటర్వెల్ బ్లాక్, సినిమా చివరి 40 నిమిషాలు అదిరిందట. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టేకింగ్ సర్ప్రైజ్ చేస్తుందని చెబుతున్నారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమా విడుదలకు ముందు హిట్ అయ్యింది. పాటల కంటే నేపథ్య సంగీతంలో అనిరుధ్ మార్క్ ఎక్కువ కనిపించిందని టాక్.
మోహన్ బాబు విలనిజం సూపర్...
ఎన్టీఆర్, కేసీఆర్ క్యారెక్టర్లు కూడా!
'ది ప్యారడైజ్' నిడివి 2:45 గంటలు. ఈ నిడివిలో శ్రీకాంత్ ఓదెల చాలా సర్ప్రైజ్లు ఇచ్చారట. ముఖ్యంగా ఈ కథ 1985 సమయంలో జరుగుతుంది. అప్పటి కాలాన్ని తెరపై ఆవిష్కరించడం కోసం రాజకీయ నాయకులను సైతం చూపించారు. వారిలో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన పాత్రను 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నటించిన పి విజయ్ కుమార్ చేశారు. కేసీఆర్ పాత్రను ప్రియదర్శి చేసినట్టు తెలిసింది. అయితే ఆ రెండు పాత్రల నిడివి చాలా తక్కువ అని, తెరపై కనిపించేది కాసేపు మాత్రమే అని టాక్.
విలన్ షికంజా మాలిక్ పాత్రలో లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటన అందరికీ షాక్ ఇస్తుందట. మరోసారి విలనిజం ఇరగదీశారట. బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ కూడా కుమ్మేశారట. హీరోయిన్ కయాదు లోహర్ రోల్ సర్ప్రైజ్తో పాటు షాక్ ఇస్తుందట.
Frequently Asked Questions
'ది ప్యారడైజ్' సినిమాలో నాని పోషించిన పాత్ర ఏమిటి?
'ది ప్యారడైజ్' దర్శకుడు ఎవరు? ఈ సినిమాలోని ప్రధానాంశాలు ఏమిటి?
ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఉన్నప్పటికీ, మదర్ సెంటిమెంట్ కథకు కీలకం. దర్శకుడి టేకింగ్ ఆశ్చర్యపరుస్తుందని తెలిసింది.
'ది ప్యారడైజ్' కథ ఏ కాలంలో జరుగుతుంది? ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరు పోషించారు?
'ది ప్యారడైజ్' కథ 1985లో జరుగుతుంది. మోహన్ బాబు విలన్ షికంజా మాలిక్ పాత్రలో అందరికీ షాక్ ఇస్తారని చెబుతున్నారు. అనిరుధ్ నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్.
'ది ప్యారడైజ్' సినిమాలో కీలకమైన ఇతర పాత్రలు ఏమిటి?
బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రను పోషించారు. సీనియర్ ఎన్టీఆర్, కేసీఆర్ పాత్రలు కూడా సినిమాలో అతిథి పాత్రలుగా కనిపిస్తాయి.
ట్రెండింగ్ వార్తలు






















