Namrata Shirodkar: న్యూ లుక్ అదిరింది, మహేశ్ స్టైలిష్ ఫోటోను షేర్ చేసిన నమ్రత - 'రాక్ చేద్దాం' అంటూ కామెంట్స్
Namrata Shirodkar: ‘గుంటూరు కారం’ విడుదల సందర్భంగా మహేశ్ బాబు స్టైలిష్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది భార్య నమ్రత.
Namrata Shirodkar: సంక్రాంతి సినిమాల సందడి మొదలయ్యింది. అందులో ముందుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ హీరో తేజ సజ్జా బరిలోకి దిగారు. వీరు నటించిన ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’.. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా ‘గుంటూరు కారం’లో మహేశ్ బాబు మాస్ విశ్వరూపం చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మహేశ్ బాబు భార్య నమత్ర కూడా ‘గుంటూరు కారం’పై కొన్నిరోజులుగా స్పెషల్ పోస్టులు చేస్తోంది. తాజాగా మహేశ్ బాబు స్టైలిష్ ఫోటోను షేర్ చేసింది. అది కూడా బాబు చాలా బాగున్నాడంటూ మహేశ్ లేడీ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేసేస్తున్నారు.
‘గుంటూరు కారం’ కోసం నమ్రత ప్రమోషన్స్..
మహేశ్ బాబు పర్సనల్ లైఫ్ గురించి, ఆన్ స్క్రీన్ విశేషాల గురించి నమ్రత ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక ‘గుంటూరు కారం’ రిలీజ్ సందర్బంగా ‘మనం రాక్ చేద్దాం ఎమ్‌బీ’ అనే క్యాప్షన్‌తో మహేశ్ స్టైలిష్ ఫోటోను పోస్ట్ చేసింది. బ్లూ టీషర్ట్, వైట్ జాకెట్‌తో కళ్లజోడు పెట్టుకొని మహేశ్ బాబు చాలా స్టైలిష్ లుక్‌లో ఉన్నాడు. ఇక ఈ పోస్ట్‌కు ‘గుంటూరు కారం’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా యాడ్ చేసింది నమ్రత. ఇక ఈ పోస్ట్‌కు కామెంట్స్‌ను ఫ్యాన్స్ ప్రశంసలతో నింపేశారు. దీంతో పాటు ఈ మూవీకి బయట హైప్ ఎలా ఉందని కూడా కొన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది నమ్రత. హైదరాబాద్‌తో పాటు ‘గుంటూరు కారం’ రిలీజ్ కోసం ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మహేశ్ బాబు కటౌట్లను తన స్టోరీలో పెట్టింది.
View this post on Instagram
పెరిగిన టికెట్ రేట్లు..
మహేశ్ బాబు ప్రతీ సినిమాకు నమ్రత తనవంతు ప్రమోషన్స్ చేస్తుంది. ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ విషయంలో కూడా యాక్టివ్‌గా పాల్గొంటోంది. ఆ మూవీ నుండి ఏ అప్డేట్ అయినా.. వెంటనే తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఫైనల్‌గా మూవీ చూసి మహేశ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్ ఎప్పటికైనా హిట్టే అని, ఆడియన్స్ అంచనాలను ఎప్పుడూ అందుకునేలాగా ఉంటుందని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘గుంటూరు కారం’ మూవీ చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్స్‌లో కూడా టికెట్ రేట్లు పెంచినా.. ఫ్యాన్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మొదటిరోజే సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారు.
హ్యాట్రిక్ మూవీ..
త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఇప్పటికే ‘అతడు’, ‘ఖలేజా’లాంటి సినిమాలు వచ్చాయి. ‘ఖలేజా’ మూవీ కమర్షియల్‌గా హిట్ అవ్వకపోయినా.. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టకపోయినా.. ఈ మూవీలో మహేశ్ కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అందుకే ఈ సినిమా ఎన్నిసార్లు టీవీలో వచ్చినా బోర్ కొడుతుంది అనకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఫైనల్‌గా 11 ఏళ్ల తర్వాత వచ్చిన ‘గుంటూరు కారం’ ఫ్యాన్స్ ఎదురుచూపులు వర్త్ అనిపించేలా చేసింది.
Also Read: హనుమాన్ రివ్యూ: తేజ సజ్జతో ప్రశాంత్ వర్మ తీసిన సూపర్ హీరో సినిమా