Akhil Akkineni Wedding: కొత్త జంటను ఆశీర్వదించండి... అఖిల్ - జైనాబ్ పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగార్జున... వైరల్ న్యూస్
Akhil Zainab Ravdjee Wedding Photos: శుక్రవారం ఉదయం అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్జీ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తనయుడి పెళ్లి ఫోటోలను షేర్ చేసిన నాగార్జున కొత్త జంటను ఆశీర్వదించమని కోరారు.

అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ వివాహం శుక్రవారం (జూన్ 6వ తేదీ) ఉదయం జరిగింది. ప్రేమించిన మహిళ జైనాబ్ రావ్జీ మెడలో మూడు ముళ్ళు వేశారు అఖిల్. నాగార్జున ఇంటిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లి హడావిడి అంతా పూర్తయిన తర్వాత కొత్త జంట ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగార్జున.
కొత్త జంటను ఆశీర్వదించండి!
''మా ఇంటిలో ఉదయం 3:35 గంటల ముహూర్తంలో జైనాబ్ రావ్జీతో మా అబ్బాయి అఖిల్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను, అమల ఎంతో సంతోషిస్తున్నాం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ప్రేమ, ఆప్యాయత, నవ్వులు వెలివెరిసిన క్షణాలలో, మాకు దగ్గరైన బంధు మిత్రుల సమక్షంలో ఒక కల (అఖిల్ పెళ్లి) నిజం కావడాన్ని మేము చూశాం. ఇవాల్టి నుంచి జీవితంలో నూతన ప్రయాణం ప్రారంభించిన కొత్త జంట ఆశీర్వదించమని మేము కోరుతున్నాం. మీ ప్రేమ, అభిమానం వారిపై ఎప్పుడు ఉండాలి'' అని నాగార్జున ట్వీట్ చేశారు.
With immense joy, Amala and I are delighted to share that our dear son has married his beloved Zainab in a beautiful ceremony (3:35 am) at our home, where our hearts belong. We watched a dream come true surrounded by love, laughter, and those dearest to us.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 6, 2025
We seek your blessings… pic.twitter.com/jiIDnQrVSk
అఖిల్ పెళ్లయిన కాసేపటికి సోషల్ మీడియాలో వీడియోలతో పాటు ఫోటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఆయా ఫోటోలలో అఖిల్ తల్లి అమల కనిపించలేదు. కొత్త జంటతో పాటు తన శ్రీమతితో దిగిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. జైనాబ్ రావ్జీ మెడలో అక్కినేని మూడు ముళ్ళు వేస్తున్న ఫోటోతో పాటు వాళ్ళిద్దరూ ఏడడుగులు వేసిన క్షణాలను కూడా నాగార్జున షేర్ చేశారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.
నాగార్జున ఇంట జరిగిన వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరొక హీరో శర్వానంద్, దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ, క్రికెటర్ తిలక్ వర్మ, దర్శకుడు ప్రశాంత్ నీల్, శిల్పా రెడ్డి సహా అక్కినేని కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. ఈ వివాహంలో అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.





















