అన్వేషించండి

Rangabali Trailer - ‘రంగబలి’ ట్రైలర్: స్పెర్మ్‌ను తేనెలా అమ్మేస్తాడట - సొంత ఊరులో నాగశౌర్య, సత్య కితకితలు!

నాగశౌర్య మళ్లీ తన లక్‌ను పరీక్షించుకోడానికి ‘రంగబలి’ మూవీతో వస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే.. హిట్టు కొట్టేలాగే ఉన్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఈసారి గట్టిగానే హిట్టు కొట్టాలనే లక్ష్యంతో వస్తున్నాడు. ‘రంగబలి’ మూవీతో ఎలాగైనా మళ్లీ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఏడాది శౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ‘రంగబలి’ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. అందుకే, ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మంగళవారం ‘రంగబలి’ ట్రైలర్‌ కూడా వచ్చేసింది. ట్రైలర్ చూస్తుంటే.. తప్పకుండా నాగశౌర్య కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందనే అనిపిస్తోంది. 

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మీ ఊరంటే నీకు ఇష్టమా? అని మురళీ శర్మ... హీరో (నాగశౌర్య)ను అడగుతారు. ‘‘ప్రతి మనిషి పేరు మీద సొంతిల్లు ఉండకపోవచ్చు. సొంత పొలం ఉండకపోవచ్చు. కానీ, సొంత ఊరైతే ఉంటుందండి’’ అంటూ మూవీ కాన్సెప్ట్‌ను శౌర్య డైలాగ్స్‌తో రివీల్ చేశారు. ఆ తర్వాత కొన్ని ఫన్నీ సీన్లు నవ్విస్తాయి. జులాయిగా తిరిగే కొడుకును తిట్టే తల్లిదండ్రులు వంటి రొటీన్ సీన్స్ కనిపిస్తాయి. ‘‘తేనెటీగ వెళ్లి.. తేనె డబ్బాను దొబ్బేసినట్లు.. సొంత షాపులో దొంగతనాలేంటి?’’ అని తల్లి మందలిస్తుంది. ఇక కమెడియన్ సత్య ఎంట్రీ నుంచి ట్రైలర్ మరింత ఫన్నీగా ఉంటుంది. ‘‘ఇది చూస్తే ఓ సినిమా గుర్తొస్తుంది భయ్యా. అందులో హీరో తన స్పెర్మ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా మనది కూడా ఇచ్చేద్దాం.. ఏదైనా పార్టీ ఉంటే చూడు బ్రో. ఒక వేళ ఒకే అంటే రోడ్డు మీద తేనె అమ్మినట్లు అమ్మేద్దాం’’ అంటూ సత్య మెడికల్ స్టూడెంట్‌ను అడగడం వంటి సీన్స్ నవిస్తాయి. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ సీన్స్, లవ్ వంటివి ట్రైలర్‌లో చూపించారు. ‘‘బయట ఊరిలో బానిసగా బతికినా పర్వాలేదు. కానీ, సొంత ఊరిలో మాత్రం సింహంలా ఉండాలి’’ అనే డైలాగ్ యూత్‌కు నచ్చుతుంది. ఆ తర్వాత విలన్ ఎంట్రీతో కథ యాక్షన్ సీన్స్‌లోని వెళ్తుంది. అయితే, కథ ఏమిటనేది రివీల్ కాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ, ట్రైలర్ సీక్వెన్స్ చూస్తుంటే.. పాత సీసాలో కొత్త సారా తరహాలోనే ఉంది. అయితే, ఎంటర్‌టైన్మెంట్‌తో ఆకట్టుకుంటే.. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చాలంటే మాత్రం.. ఈ ట్రైలర్‌లో చూపించిన ఒక బూతు పదానికి ‘బీప్’ వేయడం బెటర్. 

‘రంగబలి’ ట్రైలర్:

వాస్తవానికి ఈ మూవీ 2022లోనే అనౌన్స్ చేశారు. తర్వాత ఏమైందో తెలీదుకానీ దాదాపు ఏడాది పాటు ఎలాంటి అప్డేట్‌లు లేవు. ఈ లోగా నాగశౌర్య మరో సినిమా పూర్తి చేసుకుని రిలీజ్ కూడా చేసేశాడు. కానీ, లక్ కలిసి రాలేదు. మరి ‘రంగబలి’తో అయినా నాగశౌర్య హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్‌గా నటిస్తున్నాడు. యుక్తీ దరేజా హీరోయిన్. సత్య, అనంత్‌ శ్రీరామ్‌, గోపరాజు రమణ, శుభలేఖ సుధాకర్‌, మురళీ శర్మ, సప్తిగిరి, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. 

Read Also: సల్మాన్‌ను కచ్చితంగా చంపేస్తాం - ఆ సింగర్ హత్య కేసు నిందితుడు వార్నింగ్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget