అన్వేషించండి

ఆ రోజు జరిగిన ఘటనలో అమ్మాయిదే తప్పు - క్లారిటీ ఇచ్చిన నాగ శౌర్య

కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరలైన వీడియోపై నాగ శౌర్య క్లారిటీ ఇచ్చారు. అమ్మాయిని తన బాయ్ ఫ్రెండ్ కొట్టినా అతనికే సపోర్ట్ చేసిందని చెప్పారు. అసలు వాళ్ళు ఎవరో కూడా తనకు తెలీదని నాగ శౌర్య చెప్పారు

Naga Shourya : టాలీవుడ్ లో నటించింది, హిట్ కొట్టింది కొన్ని సినిమాలే అయినా.. మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. గత కొంత కాలంగా విజయాలకు ఆమడ దూరంలో ఉన్న ఆయన.. ఇటీవల ఓ వీడియోతో వార్తల్లో నిలిచాడు. రోడ్డుపై ఒక అమ్మాయిని కొడుతుండగా వెళ్లి.. ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఆ అమ్మాయి ఇచ్చిన రిప్లై కి షాకై.. అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఓ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. కాగా ఈ సమయంలో అసలు ఏమైంది. ఆ అమ్మాయి ఏమని సమాధానం ఇచ్చింది అన్న విషయాలను తాజాగా నాగ శౌర్య పంచుకున్నాడు. 

నాగ శౌర్య లేటెస్ట్ మూవీ 'రంగబలి' సినిమాకు సంబంధించిన టీజర్ ను మూవీ యూనిట్ మంగళవారం అంటే జూన్ 27న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో.. ‘రంగబలి’ మూవీ యూనిట్ సినిమా విశేషాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్.. నాగ శౌర్యను అడిగిన ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని పెంచింది. రీసెంట్‌గా ఒక అబ్బాయి రోడ్డుపైన అమ్మాయిని ఏడిపిస్తుంటే.. మీరు వెళ్లి కొట్టారు కదా? అంతలా రియాక్ట్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘‘నిజం చెప్పాలంటే అతన్ని నేను కొట్టలేదు. నేను ఏదో పని మీద వెళ్తుంటే.. ఓ అమ్మాయిని ఒక అబ్బాయి కూకట్‌పల్లిలో రోడ్డు మీద కొడుతున్నాడు. అది చూసి ఆగి ఎందుకు కొడుతున్నావని అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి నా బాయ్‌ఫ్రెండ్ నన్ను కొడితే కొడతాడు, చంపితే చంపుతాడు. మీకేంటి అని రివర్స్‌ అయింది’’ అని తెలిపాడు. 

‘‘అందుకే అమ్మాయిలకు చెప్తున్నా.. కొట్టే అబ్బాయిలను పెళ్లి చేసుకోవద్దు. అది మీకు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు. ప్రేమగా చూసుకునే వాళ్లతో తప్ప.. కొట్టినా, తిట్టినా భరిస్తామని పెళ్లి చేసుకోవద్దు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్‌లో ఖచ్చితంగా అమ్మాయిదే తప్పు" అని నాగ శౌర్య అసలు విషయాన్ని చెప్పారు. అలా జరిగిన తర్వాత ఆ అమ్మాయికి ఏం చెప్పారనే ప్రశ్నకు బదులిస్తూ.. "అలా అన్నాక ఇంకేం చెప్తాం. అసలైతే పోలీస్ కంప్లయింట్ ఇద్దామనుకున్నాను. కానీ, నన్ను చంపేసినా, కొట్టినా పర్లేదంటే ఏం చేయగలను. ఇదిలా ఉంటే.. ఈ వీడియో చూసిన కొంతమంది నేనేదో టీఆర్‌పీ రేటింగ్ కోసం ప్లాన్ చేశానన్నారు. నిజంగా వాళ్లెవరో నాకు తెలియదు" అని నాగ శౌర్య చెప్పుకొచ్చారు.

నాగ శౌర్య మూవీ విషయానికొస్తే.. ‘రంగబలి’ని.. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, మురళీ శర్మ, గోపరాజు రమణ తదితరులు నటించారు. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. పవన్ సీహెచ్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం.. జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంటెంట్ చూస్తుంటే మాత్రం ఈసారి నాగశౌర్య పక్కా హిట్ కొడతాడనే ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Read Also : 'ఆదిపురుష్' పని అయిపోయినట్టేనా? ఇంత తక్కువ కలెక్షన్లా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget