అన్వేషించండి

Thandel : ‘తండేల్’ న్యూ షెడ్యూల్ - ఆ నగరంలో పాకిస్థాన్ సెట్

Thandel : నాగచైతన్య 'తండేల్' మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోని ఓ ప్రత్యేక సెట్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Naga Chaitanya’s Thandel Shooting : నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'తండేల్' మూవీ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్ చందు మొండేటి. రీసెంట్ గానే షూటింగ్ మొదలుపెట్టిన మూవీ టీం ఎలాంటి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని పూర్తి చేస్తున్నారు. దసరా పండుగను టార్గెట్ గా పెట్టుకొని పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. రీసెంట్ గానే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మూవీ టీం తాజాగా మరో షెడ్యూల్ ని ప్లాన్ చేసింది. ఇందుకోసం హైదరాబాదులో ఓ భారీ సెట్ వేసినట్లు తాజా సమాచారం. 

హైదరాబాద్ లో పాకిస్థాన్ సెట్

'తండేల్' సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. గుజరాత్‌ రాష్ట్రం సూరత్ లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు చందు మొండేటి. ఇందుకోసం చాలానే రీసెర్చ్ చేశారు. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. చైతు ఇందులో మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు.

సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ తో పాటు దేశభక్తి కోణాన్ని కూడా చూపించబోతున్నారు. ఇక తాజాగా 'తండెల్' లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. దీనికోసం కోసం హైదరాబాదులో పాకిస్తాన్ జైల్ సెట్ వేసినట్లు తెలిసింది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా సెట్ వర్క్ ఉండనున్నట్లు సమాచారం. అందుకోసం నిర్మాత బన్నివాసు గట్టిగానే ఖర్చు చేస్తున్నారట. ఈ వారం నుంచి ఆ సెట్ లో నాగచైతన్య పై కొన్ని కీలక సన్నివేశాలను తీయనున్నారుట.

మరోసారి రిపీట్ కానున్న చైతూ - సాయి పల్లవి జోడి

'తండేల్' సినిమాలో నాగచైతన్య సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో చైతు, సాయి పల్లవి పెయిర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో ఇద్దరూ తమ న్యాచురల్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసారు. ఇప్పుడు మరోసారి 'తండెల్' తో అదే మ్యాజిక్ రిపీట్ కాబోతోంది. ఇందులో సాయి పల్లవి గ్రామీణ యువతిగా కనిపించనుంది. 

'దేవర' కి పోటీగా 

చైతూ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా 'తండెల్' రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా టైంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ 'దేవర' మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. నాగచైతన్య 'తండెల్' కూడా సరిగ్గా అదే సమయంలో అంటే ఎన్టీఆర్ 'దేవర'కి పోటీగా థియేటర్స్ లో సందడి చేయనున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 'దేవర', 'తండేల్' సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.

Also Read : 'క్వీన్' సీక్వెల్‌కు క‌థ రెడీ - మళ్లీ కంగనాకే ఛాన్స్?

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 14 సినిమాలు... ఇవి అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 14 సినిమాలు... ఇవి అస్సలు మిస్ కావొద్దు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Lenin Twitter Review - లెనిన్ ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సూపర్బ్... అఖిల్ అదరగొట్టాడు... యూఎస్ టాక్ ఎలా ఉందంటే?
లెనిన్ ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సూపర్బ్... అఖిల్ అదరగొట్టాడు... యూఎస్ టాక్ ఎలా ఉందంటే?
Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌లోకి నిస్సాన్ టెక్టాన్ ఎంట్రీ - 6 వేరియంట్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్లు & ప్రీమియం ఫీచర్లతో లాంచ్‌
కేవలం రూ.10.49 లక్షలకే కొత్త నిస్సాన్ టెక్టాన్ - క్రెటా, సెల్టోస్‌కు కొత్త సవాల్
Breaking News:నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం- ముగ్గురు మంత్రులు గైర్హాజరు
Lenin Live Updates: లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
లెనిన్ లైవ్ అప్డేట్స్... స్పాయిలర్స్ లేకుండా అఖిల్ అక్కినేని సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Benefits Of Matcha Tea: గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
గ్రీన్ టీ యుగం ముగిసింది! బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ మాచా టీ తాగుతున్న సెలబ్రిటీలు!
Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?
Embed widget