Naga Chaitanya : హ్యాపీ బర్త్ డే నాగ చైతన్య - అక్కినేని యంగ్ హీరో గురించి మీకు తెలియని విషయాలివే!
Naga Chaitanya Movies : అక్కినేని వారసుడు, టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బర్త్ డే సందర్భంగా విషెష్ వెల్లువెత్తుతున్నాయి. మరి ఆయన కెరీర్, లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు ఓసారి చూస్తే...

Naga Chaitanya Career Personal Life Details : అక్కినేని వారసుడిగా కాదు... యాక్టింగ్‌లో తనదైన స్టైల్, టాలెంట్‌తో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ నాగ్ చైతన్య. 'జోష్' ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చి 'తండేల్'తో తనేంటో నిరూపించుకున్నాడు. ఆదివారం ఆయన బర్త్ డే సందర్భంగా చైతూ లైఫ్‌లో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు మీకోసం...
కెమెరా వెనుక స్టోరీ
నటుడిగా ఎంట్రీ ఇవ్వక ముందే నాగ చైతన్య ఎన్నో నెలల తరబడి ట్రైనింగ్ తీసుకున్నాడు. ముంబైలో యాక్టింగ్ వర్క్ షాప్ కంప్లీట్ చేసి ఆ తర్వాత లాస్ ఏంజిల్స్‌లో యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్, వాయిస్ టెక్నిక్‌ల్లో శిక్షణ పొందాడు. కెమెరాను ఫేస్ చేసే ముందే ఓ బలమైన బేస్మెంట్ నిర్మించుకుని... స్ట్రాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశాడు.
మ్యూజిక్‌లోనూ...
చైతన్యకు మ్యూజిక్ అంటే ప్రాణం. ఈ విషయం చాలామందికి తెలియదు. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో కీబోర్డ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తన స్కూల్ బ్యాండ్‌లో వాయించాడు. మ్యూజిక్ అతనికి ఎప్పటికీ ఇష్టమైన అభిరుచుల్లో ఒకటి.
స్క్రిప్ట్స్ సెలక్షన్స్‌లో...
తన తండ్రి నాగార్జున, సోదరుడు అఖిల్‌తో చైతన్య అన్నీ విషయాలు షేర్ చేసుకుంటాడు. ముఖ్యంగా తండ్రీ కొడుకుల్లా కాకుండా ఫ్రెండ్స్‌లా నాగ్, చై ఉంటారు. స్క్రిప్ట్స్ సెలక్షన్‌పై తండ్రి సలహా కోరుతూనే... క్రియేటివ్ ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటాడు. తన సోదరుడు అఖిల్‌తోనూ ప్రతీ విషయాన్ని పంచుకుంటాడు. ఇది వారి మధ్య అనుబంధాన్ని మరింత పెంపొందిస్తుంది. ప్రతీ మూవీలోనూ కొత్తగా తనను తాను మలుచుకుంటూ సక్సెస్ వైపు దూసుకెళ్తున్నాడు చై.
Also Read : చెత్త రీల్స్ అంటూ 'డ్యూడ్'పై రివ్యూ - 'నీ పని నువ్వు చూసుకో' అంటూ డైరెక్టర్ కౌంటర్... అసలు స్టోరీ ఏంటంటే?
డేరింగ్ స్టెప్
2023, డిసెంబర్ 1న ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో 'దూత' వెబ్ సిరీస్ ద్వారా చై డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. ఓటీటీ ఒరిజినల్ హెడ్ లైన్‌గా నిలిచిన ఫస్ట్ తెలుగు సినిమా నటుల్లో ఒకరిగా నిలిచాడు. ఇది ఓ డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో ఆయన జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నటించి మెప్పించారు.
బెల్ట్ ఫుడీ... ఫుడ్ బిజినెస్‌లోకి...
నాగచైతన్య తాను ఎప్పుడు తను బెస్ట్ ఫుడీ అనే చెప్పుకొంటుంటారు. అందుకు తగ్గట్లుగానే ఫుడ్ బిజినెస్ రంగంలోనూ రాణిస్తున్నారు. అందరికీ పాన్ ఆసియన్ రుచులను అందించే 'షోయు', వరల్డ్ ఫేమస్ ఫుడ్స్‌కు ప్రసిద్ధి చెందిన 'స్కూజీ' అనే 2 క్లౌడ్ కిచెన్లను స్టార్ట్ చేశారు.
చైను వరించిన అవార్డులివే...
నాగ చైతన్య తన కెరీర్‌లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 'జోష్' మూవీలో నటనకు సౌత్ ఫిలిం ఫేర్ అవార్డు, 'మనం' సినిమాలో నటనకు 'నంది' అవార్డు, పవర్ ఫుల్ రోల్స్‌కు SIIMA క్రిటిక్స్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఫస్ట్ వెబ్ సిరీస్ 'ధూత'కు బిహైండ్‌వుడ్స్ నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డుతో పాటు ఆసియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. వరుసగా నాలుగేళ్లు హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో కూడా ఉన్నాడు.
కార్స్, బైక్స్ అంటే ప్రాణం
చైతన్యకు కార్లు, బైక్స్ అంటే ప్రాణం. పలు సందర్భాల్లో తన భార్య శోభితతో దిగిన ఫోటోల్లోనూ ఇది నిజమైంది.హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మోటార్ స్పోర్ట్ జట్టును ఆయన సొంతం చేసుకోవడం ద్వారా ఆయన ఇష్టాన్ని వేరే లెవల్‌కు తీసుకెళ్లారు.






















