అన్వేషించండి

Mukhesh Rushi: కన్నప్పలో ‘ఇంద్ర’ విలన్ లుక్స్ చూశారా?

Kannappa: సీనియర్ నటుల సూపర్ లుక్స్ తో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు భక్త కన్నప్ప ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తోంది. తాజాగా కంపడు, గవ్వరాజు అనే క్యారెక్టర్ల పోస్టర్ ను విడుదల చేసింది. 

Kannappa Cinema Updates: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు భక్త కన్నప్ప రోజుకో సర్‌ప్రైజ్‌ లుక్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సూపర్ లుక్స్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కంపడు, గవ్వరాజు అనే క్యారెక్టర్లను ప్రేక్షకులకు పరిచయం చేసింది చిత్ర బృందం. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.   

హీరో విష్ణు మంచు కెరియర్ లోనే ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా సినిమాగా విడుదలకి సిద్ధం అవుతున్న కన్నప్ప సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ అప్టేట్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్యకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో.. మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తున్నారు. 

ప్రతి సోమవారం ఓ అప్‌డేట్ ఇస్తున్న భక్త కన్నప్ప టీం

శ్రీకాళహస్తిశ్వర స్థలపురాణం ఆధారంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్న నటీనటుల లుక్స్ కి సంబంధించిన పోస్టర్ల ను చిత్ర బృందం ప్రతి సోమవారం విడుదల చేస్తోంది. ఇదే క్రమంలో సోమవారం మరో ఇద్దరు నటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు సోమవారం విడుదల చేసింది. ఆ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మధుబాల,శరత్‌కుమార్‌, దేవరాజ్‌ వంటి నటీనటులు పోషిస్తున్న పాత్రలను పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేసింది చిత్ర బృందం.

కంపడుగా ముఖేష్ రిషి

తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటుడు ముఖేష్‌ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు.. బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ముఖేష్ రిషి ఈ సినిమాలో ‘కంపడు’ అనే పాత్ర పోషిస్తున్నారు. ‘గవ్వరాజు’గా బ్రహ్మాజీ ఈ సినిమాలో కనిపించనున్నారు.

Also Read: రామ్‌ చరణ్‌తో సెల్ఫీ - కల నెరవేరిందన్న మెల్‌బోర్న్‌ మేయర్‌ నిక్ రీస్, పోస్ట్‌ వైరల్‌

అత్యంత పురాతన తెగ అయిన పుళిందుల అనే ఒక భయంకరమైన తెగకు చెందిన వారుగా వీళ్ళు ఈ సినిమాలో కనిపించనున్నారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వాయులింగానికి ఈ తెగ వారు వంశపారంపర్య రక్షకులు. వాళ్ళ నాయకుడు కంపడు. భద్రగణాన్ని నడిపిస్తూ ఉంటాడు. ముఖేష్ రుషి పోస్టర్ చూశాక ఇంకా ఎంతమంది సీనియర్ నటులు ఈ చిత్రంలో భాగస్వామ్యమయ్యారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. 

భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో.. 

ప్రభాస్‌తోపాటు మోహన్ బాబు, మోహన్ లాల్,  బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లు ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించనున్నారు.  ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు భారీగా మొదలు పెట్టనున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

Also Read: సంక్రాంతి రేసులో బాలకృష్ణ - చిరు, అజిత్ సినిమాలకు పాటూ... 

టాప్ హెడ్ లైన్స్

Na Wife Missing OTT : వైఫ్ మిస్సింగ్... అసలు క్రిమినల్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు క్రైమ్ థ్రిల్లర్
వైఫ్ మిస్సింగ్... అసలు క్రిమినల్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ సందేశ్, శ్వేతా బసు క్రైమ్ థ్రిల్లర్
Psychological Thriller OTT : నిద్రలో నడిచే అలవాటు... కలలు నిజమైతే? - ఓటీటీలోకి వచ్చేసిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్
నిద్రలో నడిచే అలవాటు... కలలు నిజమైతే? - ఓటీటీలోకి వచ్చేసిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్
Jailer 2 Collection : రజనీ కాంత్ జైలర్ 2 మరో రికార్డు - వారం రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
రజనీ కాంత్ జైలర్ 2 మరో రికార్డు - వారం రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
Sai Pallavi : రామాయణ 3Dలోనే చూడండి - అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్... ఆడియన్స్‌కు సాయి పల్లవి రిక్వెస్ట్
రామాయణ 3Dలోనే చూడండి - అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్... ఆడియన్స్‌కు సాయి పల్లవి రిక్వెస్ట్

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
Embed widget