అన్వేషించండి

M.S. Narayana Son: తరుణ్ అందుకే సినిమాలు చేయడం లేదు, మోహన్ బాబు ఫ్యామిలీ కూడా కష్టపడుతోంది: ఎంఎస్ నారాయణ కొడుకు విక్ర‌మ్

M.S. Narayana Son: ఎంఎస్ నారాయ‌ణ‌.. మంచి క‌మెడియ‌న్. ఎంతోమందిని త‌న యాక్టింగ్ తో క‌డుపుబ్బా న‌వ్వించారు. కానీ, ఆయ‌న వార‌సులు ఎవ్వ‌రూ సినీ ఇండ‌స్ట్రీలో లేరు. దానిపై మాట్లాడారు ఆయ‌న కొడుకు విక్ర‌మ్.

M.S. Narayana Son About films & Tollywood: ఎంఎస్ నారాయ‌ణ‌.. తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీలో గొప్ప హాస్య న‌టుడు. ఎంతోమందిని త‌న యాక్టింగ్ తో క‌డుపుబ్బా న‌వ్వించారు ఆయ‌న‌. ఆయ‌న మ‌న మ‌ధ్య‌లో లేక‌పోయినా ఆయ‌న చేసిన కామెడీని మాత్రం ఎవ్వ‌రూ మ‌ర్చిపోరు. కానీ, ఆయ‌న వార‌సులు ఎవ్వ‌రూ ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీలో లేరు. దానిపై స్పందించారు ఆయ‌న కొడుకు విక్ర‌మ్. రీసెంట్ గా ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్నో విష‌యాల గురించి చెప్పారు. టాలెంట్ లేక ఎవ్వ‌రూ సినిమాల‌కు దూరం అవ్వ‌ర‌ని, క‌లిసిరాకే దూరంగా వెళ్తార‌ని అన్నారు. కొడుకు సినిమా త‌ర్వాత త‌ను మ‌ళ్లీ ఎందుకు సినిమాలు చేయ‌లేదో? త‌రుణ్ లాంటి వాళ్లు సినిమాల‌కు ఎందుకు దూరం అయ్యారో చెప్పుకొచ్చారు విక్ర‌మ్. 

మాదీ సాదాసీదా కుటుంబం.. 

విక్ర‌మ్ 'కొడుకు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఆయ‌న న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే, ఆ సినిమా త‌ర్వాత విక్ర‌మ్ అస‌లు సినిమా తీయ‌లేదు. దానిపై ప్ర‌శ్నించ‌గా ఆయ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పారు. "అంత పొట‌న్షియ‌ల్ లేదు మాకు. మాది అంత‌ పెద్ద కుటుంబం కాదు. ఎంఎస్ నారాయ‌ణ రైతు కుటుంబం నుంచి వ‌చ్చి, లెక్చ‌ర‌ర్ గా చేసి ఎదిగిన వ్య‌క్తి. మేం అంత డ‌బ్బు ఉన్న ఫ్యామిలీ కాదు. క‌ళ అంటే ఆయ‌న‌కు ఇష్టం తప్ప బాగా డబ్బునోళ్లం కాదు. అంత పొట‌న్షియ‌ల్, డ‌బ్బు ఉంటే చేసేవాడినేమో. ఎవ‌రైనా ఒక సినిమా చేశారు. ఫ్లాప్ అయ్యింది. వాళ్ల‌కు వెనుకాల పొట‌న్షియ‌ల్ ఉంటే మ‌ళ్లీ సినిమాలు ప‌డ‌తాయి. అది లేకుండా ఎంత‌మంచి న‌టుడైన నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మే ఈ ఫిల్డ్ లో. నిల‌బెట్టుకునే కెపాసిటీ ఉండి.. ఆవ‌గింజంత అదృష్టం కూడా ఉండాలి. ల‌క్ తోడ‌వ్వాలి. ల‌క్ లేక‌పోతే.. కింద‌కి వెళ్లిపోతారు త‌ప్ప ఇంకేంలేదు. అలాంటిదే నా విష‌యం కూడా" అని చెప్పారు విక్ర‌మ్. 

టాలెంట్ లేక కాదు..  

"హీరో త‌రుణ్ చాలా టాలెంటెడ్. చిన్న‌ప్ప‌టి నుంచి న‌టిస్తున్నాడు. సినిమాకి వెళ్లి అత‌డిని చూసి చాలా ఆనంద‌ప‌డ్డాం. అత‌నిలో స్పార్క్ ఉంది. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ ఇప్పుడు టాలెంట్ లేక సినిమాలు తీయ‌డం లేదా? 'హ్యాపీ డేస్'లో చేసిన వాళ్ల‌కి ఇప్పుడు ఛాన్స్ లు ఏమైనా వ‌స్తున్నాయా? అన్ని హిట్లు ఇచ్చిన అబ్బాస్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్లంద‌రికీ టాలెంట్ ఉంది. మ‌రి వాళ్ల‌ను మీరు ఎందుకు నిల‌బెట్ట‌లేదు? టాలెంట్‌కి, స్థిర‌ప‌డ‌టానికి సంబంధం లేదు. టాలెంట్ అనేది వేరు. రేపు నాకు ఛాన్స్ వ‌స్తే నేను ప్రూవ్ చేసుకుంటానేమో. అవ‌కాశం ఇంపార్టెంట్ , క‌లిసి రావ‌డం ఇంపార్టెంట్. చాలా యాస్పెక్ట్స్ ఉంటాయి. సినిమా ఇండ‌స్ట్రీలో అందుకే, వీడు టాలెంట్ వాడు టాలెంట్ కాదు అనొద్దు. టైమింగ్, నువ్వు వ‌చ్చిన టైం, నీకు వ‌చ్చిన అవ‌కాశం. ల‌క్ ఫ్యాక్ట‌ర్ ఇంపార్టెంట్. వ‌రుణ్ సందేశ్ ఎన్ని సినిమాలు చేశారు. 'కొత్త బంగారు లోకం', 'హ్యాపీ డేస్' లాంటివి చేశాడు. ఆయ‌న‌కు టాలెంట్ లేకా.. కాదు క‌దా? నా క‌న్నా చిన్న‌వాళ్లు చాలా టాలెంటెడ్ ఉన్నారు. సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఒక్క‌రు టాలెంట్. ఒక‌రు ఒక క్యారెక్ట‌ర్ కి సూట్ అవుతారు. క‌లిసి రావ‌డం, అవ‌కాశం ఇంపార్టెంట్ అంతేత‌ప్ప‌.. టాలెంట్ లేదు, వాడు ఇలా చేయ‌లేదు. వాడు అలా చేశాడు అనేది అంతా ట్రాష్." 

బ్యాగ్రౌండ్ అనేది ఉత్త‌మాట‌.. 

సినిమా ఇండ‌స్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటే నిల‌దొక్కుకుంటారు అంటారు క‌దా? బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాల్లో  ఎవ‌రు స్థిర‌ప‌డ్డారు?  "బ్యాగ్రౌండ్ ఇంపార్టెంట్ అయితే, అమితాబ్ బ‌చ్చ‌న్ కొడుకు ఇప్పుడు ఎంత‌పెద్ద స్టార్ అవ్వాలి. వాళ్ల కుటుంబంలో ఒక వ్య‌క్తి క‌ష్ట‌ప‌డి స్టార్ పొజిష‌న్ కి వెళ్లారు కాబ‌ట్టి.. వాళ్లు క‌ష్ట‌ప‌డ్డారు దాన్ని నిల‌బెట్టుకుంటారు. కానీ, బ్యాగ్రౌండ్ ఎవ్వ‌రికీ వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. మోహ‌న్ బాబు గారి కుటుంబం ఎంత క‌ష్ట‌ప‌డుతుంది. చిరంజీవి గారి కుటుంబం కూడా క‌ష్ట‌ప‌డుతుంది. మెట్టు మెట్టు ఎక్కి పైకి వ‌చ్చారు. కానీ, వాళ్లంద‌రికీ వెనుక ఎవ‌రో ఒక‌రు ఉన్నారు కాబ‌ట్టి వాళ్ల నీడ వీళ్ల‌మీద ప‌డుతుంది అంతే" అని చెప్పారు విక్ర‌మ్.  

Also Read: 'ల‌వ్ మీ' నుంచి ‘ఆట‌గ‌ద‌రా శివ’ లిరిక‌ల్ సాంగ్... శివ మాయపై కీరవాణి అదిరిపోయే పాట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Embed widget