అన్వేషించండి

Mr. Bachchan OTT: ‘మిస్టర్ బచ్చన్’ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్

Mr. Bachchan OTT: ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు ఇప్పటికే సరిపడా బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ దీని స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం.

Mr. Bachchan OTT Rights: ఈరోజుల్లో చాలా వరకు సినిమాలు విడుదల అవ్వక ముందు, బాక్సాఫీస్ వద్ద దాని రిజల్ట్ ఏంటో తెలియక ముందే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ రైట్స్ కోసం క్యూ కడుతున్నాయి. ఆ కేటగిరిలో ఇప్పుడు రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ కూడా యాడ్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’పై ఇప్పటికీ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యింది. వారి కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఆగస్ట్ 15న ఎన్నో సినిమాలకు పోటీగా ఈ సినిమాను కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

ఆ ఓటీటీలోనే..

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. దీని కోసం ఈ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ బాగానే ఖర్చు చేసిందట. కానీ ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ విషయంలో యాక్టివ్ అవుతున్న ‘మిస్టర్ బచ్చన్’ టీమ్.. ఓటీటీ పార్ట్‌నర్ గురించి అనౌన్స్ చేయడానికి ఇంకా సమయం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. జగపతి బాబు విలన్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘మిస్టర్ బచ్చన్’ నుండి విడుదలయిన ఒక రొమాంటిక్ సాంగ్, ఒక మాస్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హ్యాట్రిక్ కాంబినేషన్స్..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ద్వారా ‘మిస్టర్ బచ్చన్’ను భారీ ప్రొడక్షన్ వాల్యూతో నిర్మిస్తున్నారు టీజీ విశ్వప్రసాద్. ఇప్పటికే రవితేజ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రెండు సూపర్ హిట్ చిత్రాలు రాగా.. ‘మిస్టర్ బచ్చన్’ హ్యాట్రిక్‌గా నిలవనుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రవితేజ, హరీష్ కాంబినేషన్‌లో కూడా ఇది హ్యాట్రిక్ సినిమానే. టాలీవుడ్‌కు హరీష్‌ను దర్శకుడిగా పరిచయం చేసిందే రవితేజ. ఈ మాస్ మహారాజ్ హీరోగా నటించిన ‘షాక్’.. దర్శకుడిగా హరీష్ శంకర్ డెబ్యూ చిత్రం. కానీ అది కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో ‘మిరపకాయ్’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతోంది.

అరడజను సినిమాలకు పోటీగా..

తాజాగా ఆగస్ట్ 15న ‘మిస్టర్ బచ్చన్’ థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ అప్పటికే స్వాతంత్ర్య దినోత్సవానికి థియేటర్లలో సందడి చేయడం కోసం ఎన్నో చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు అరడజను సినిమాలకు పోటీగా ‘మిస్టర్ బచ్చన్’ కూడా అదేరోజు విడుదలకు సిద్ధమయ్యింది. ప్రమోషన్స్‌లో వేగం పెంచితే ఈ సినిమా చాలామంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఇక ‘మిస్టర్ బచ్చన్’లో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్త గత కొన్నిరోజులుగా సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై మూవీ టీమ్ ఇంకా స్పందించాల్సి ఉంది.

Also Read: రవితేజతో టిల్లు సందడి - అదరగొట్టే అతిథి పాత్రలో యంగ్ హీరో!

టాప్ హెడ్ లైన్స్

Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Siddharth Galla Wife: ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Embed widget