Mirai VFX Studio: 'మిరాయ్' చూశాక వీరమల్లు, వార్, ఘాటీలు వస్తే కష్టమే... స్టాండర్డ్స్ సెట్ చేసిన పీపుల్ మీడియా
Mirai VFX Company: 'మిరాయ్'కు వీఎఫ్ఎక్స్ చేసింది ఎవరు? థియేటర్లలో సినిమా చూశాక ఆడియన్స్ సైతం ఎంక్వైరీ చేశారు. ఆ రేంజ్ క్వాలిటీ ఉంది. ఇకపై వచ్చే సినిమాలకు ఇదొక స్టాండర్డ్ సెట్ చేసిందని చెప్పవచ్చు.

Mirai Movie Highlights: 'మిరాయ్' మూవీలోని హైలైట్స్‌లో వీఎఫ్ఎక్స్ గురించి రివ్యూ రైటర్లతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎక్కువ చెబుతున్నారు. దీనికి వీఎఫ్ఎక్స్ చేసిన కంపెనీలు ఏమిటని ఆడియన్స్ సైతం ఆరా తీస్తున్నారు. ఆ రేంజ్ క్వాలిటీ అవుట్ పుట్ వచ్చింది. ఇక మీదట వచ్చే సినిమాలకు వీఎఫ్ఎక్స్ విషయంలో ఈ మూవీ ఒక స్టాండర్డ్స్ సెట్ చేసిందని చెప్పవచ్చు.
'మిరాయ్'కు వీఎఫ్ఎక్స్ చేసింది సొంత కంపెనీయే!
సినిమాలకు వీఎఫ్ఎక్స్ చేయడానికి కొన్ని కంపెనీలు ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆయా కంపెనీలతో తమకు ఏ విధంగా కావాలి? ఏయే సీన్స్ వీఎఫ్ఎక్స్ చేయాలి? అనేది ముందుగా దర్శక నిర్మాతలు మాట్లాడతారు. బడ్జెట్ బట్టి ఒక్కోసారి వీఎఫ్ఎక్స్ క్వాలిటీ ఉంటుంది. ఇటీవల కాలంలో 'కన్నప్ప', 'హరి హర వీరమల్లు', 'వార్ 2', 'ఘాటీ' వంటి పెద్ద సినిమాలు వచ్చాయి. పెద్ద బడ్జెట్లతో ఆ మూవీస్ తెరకెక్కాయి. కానీ, వీఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నాయి.
పెద్ద సినిమాల్లో వీఎఫ్ఎక్స్ మీద విమర్శలు వస్తున్న ఈ తరుణంలో తప్పులు వెతికే అవకాశం 'మిరాయ్' ఇవ్వలేదు. క్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఇచ్చింది టీమ్. ఈ విషయంలో బయట కంపెనీలపై 'మిరాయ్' ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నమ్మకం పెట్టుకోలేదు. మెజారిటీ వీఎఫ్ఎక్స్ వర్క్ అంతా సొంత కంపెనీలో చేయించింది.
దర్శకుడితో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా ముఖ్యం!
క్వాలిటీ వీఎఫ్ఎక్స్ చేయించుకునే విషయంలో దర్శకుడికి విజన్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆయన ఊహను అర్థం చేసుకుని సన్నివేశాలు తెరకెక్కించే కెమెరా మ్యాన్ కూడా ఉండటం ముఖ్యం. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఒక్కరే కావడం వల్ల 'మిరాయ్'కు కలిసొచ్చింది. కార్తీక్ ఘట్టమనేని ఒక విజన్ దృష్టిలో పెట్టుకుని మూవీ షూట్ చేశారు. ఆయనకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యాడ్ కావడంతో టైం తీసుకుని వీఎఫ్ఎక్స్ చేశారు.
'మిరాయ్' చూశాక వీరమల్లు, వార్ 2, ఘాటీలు వస్తే కష్టమే!
'కన్నప్ప'కు హిట్ టాక్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు రాలేదు. కానీ విష్ణు మంచు తమ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయని క్రిటిక్స్ - ఆడియన్స్ పెద్ద మనసుతో క్షమించారని విష్ణు మంచు చెప్పారు. వీరమల్లు వీఎఫ్ఎక్స్ మీద ట్రోల్స్ నడిచాయి. సక్సెస్ మీట్‌లో టెక్నికల్ పరమైన అంశాల్లో మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడూ ఆస్కారం ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Also Read: 'మిరాయ్' రివ్యూ: క్లైమాక్స్‌లో శ్రీరాముడు వచ్చాడు... తేజా సజ్జా - మంచు మనోజ్ మూవీ హిట్టేనా?
'వార్ 2' టీజర్ విడుదల అయ్యాక వచ్చిన ట్రోల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఘాటీలో అనుష్కను స్లిమ్ చేశారని ట్రోల్స్ ఉన్నాయి. బాంబు బ్లాస్ట్ సీన్స్ బాలేదన్నారు. 'మిరాయ్' చూసిన కళ్ళతో ఇక మీదట అటువంటి వీఎఫ్ఎక్స్ లోపాలు ఉన్న సినిమాలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టమే. దర్శక నిర్మాతలు, హీరోలు జాగ్రత్తలు తీసుకోవాలి. 'విశ్వంభర' టీజర్ ట్రోల్ అయ్యింది. ఆ సినిమా వర్క్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: 'కిష్కింధపురి' రివ్యూ: బెల్లంకొండ - అనుపమ కలిసి భయపెట్టారా? హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?





















