మీకు తెలుసా? ఈ ఆర్మీ ఆఫీసర్, ఆ స్టార్ హీరోయిన్ సోదరి!
ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాను కలిగి ఉన్న ఖుష్బూ పటానీ ఎవరో తెలుసా. ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి. దిశ అక్కయిన ఖుష్బూ పటానీ.. దేశానికి సేవ చేయడంలో తన అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తోంది.
Lieutenant Khushboo Patani:
మన టాలీవుడ్, బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు తమ చెల్లెళ్లను లేదా అక్కలను హీరోయిన్లుగా పరిచయం చేశారు. నగ్మా, సాక్షి శివానంద్, కాజల్, కరిష్మ కపూర్, జయప్రద, భానుప్రియ, భాగ్యశ్రీ.. ఇలా చెబుతూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఆ హీరోయిన్లు అల్రెడీ సినీరంగంలో ఉన్నారు కాబట్టి.. తమ కుటుంబ సభ్యులను ఇండస్ట్రీకి పరిచయడం పెద్ద కష్టం కాదు. అందుకే, దాదాపు చాలామంది హీరోలు, హీరోయిన్లు తమ కుటుంబ సభ్యులను ఇండస్ట్రీలోకి వదులుతుంటారు. అయితే, ఈ హీరోయిన్ సోదరి మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన సోదరి సినీ ఇండస్ట్రీలో అందాలు ఆరబోస్తుంటే.. ఆమె మాత్రం సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తున్నారు. ఇంతకీ ఆమె మరెవ్వరో కాదు.. ‘లోఫర్’ భామ దిశా పటాని సోదరి కుష్బు పటాని.
దిశా కంటే వయసులో పెద్దయిన ఖుష్బూకు సంబంధించిన ఓ ఫొటో ఇటీవల వైరల్ గా మారింది. ఈ ఫొటోలో వీరిద్దరూ కనిపించడంతో పాటు.. మరొక ఫొటోలో ఖుష్బూ.. ఇండియన్ ఆర్మీ డ్రెస్సులో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. చాలా మంది తమ ఫ్యామిలీలో ఒకరు ఒక రంగంలో పాపులర్ అయితే.. వారిని స్ఫూర్తిగా తీసుకుని అదే రంగంలోకి తమ లక్ పరీక్షించుకుంటారు. కానీ ఖుష్బు మాత్రం అలా చేయకుండా.. దేశానికి సేవ చేయాలనే గొప్ప మార్గాన్ని ఎంచుకున్నారు. ఖుష్బూ పటానీ ప్రస్తుతం భారత సైన్యంలో లెఫ్టినెంట్ హోదాను కలిగి ఉన్నారు. ఆమె దేశ సేవలో చురుకుగా పాల్గొంటు.. తన సైనిక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఫిట్‌నెస్‌లో ఇద్దరూ ఇద్దరూ
సినీ రంగంలో రాణించాలన్నా.. దేశానికి సేవ చేయాలన్నా ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకే, దిశ, కుష్బు ఈ విషయంలో అస్సలు రాజీపడరు. అందుకే, అందరికీ ఉపయోగపడేలా అప్పుడప్పుడు తన వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
View this post on Instagram
ఖుష్బూ చెల్లెలు దిశా పటానీతో దిగిన పలు ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. వారి మధ్య ఉన్న బంధాన్నితెలియజేలా, హృదయాన్ని కదిలించేలా ఈ చిత్రాలు.. వారివురి మధ్య ఉన్న బలమైన అనుబంధం, ప్రేమకు ప్రతీకగా నిలుస్తాయి. ఇక దిశా పటానీ కూడా గతంలో తన సోదరి ఖుష్బూ.. ఆర్మీ శిక్షణ రోజులకు సంబంధించి పలు ఫొటోలను పంచుకుంది. దేశానికి సేవ చేయడంలో తన సోదరి నిబద్ధతకు గర్వంగా ఫీలవుతూ.. ప్రశంసలు కూడా కురిపించింది. అంతే కాదు దిశా... ఖుష్బూని తన "వండర్ వుమన్" గా పిలవడం వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ ను కళ్లకు అద్దినట్టు చూపిస్తుంది.
Read Also : Salman Khan: ఆ హీరో బ్రెయిన్ సర్జరీకి బిల్ కట్టి, ప్రాణాలు కాపాడిన సల్మాన్ ఖాన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial