అన్వేషించండి

Prabhas, Maruthi Movie: ప్రభాస్ - మారుతీ సినిమా రిలీజ్ ఎప్పుడు? షూటింగ్ సాగుతోందా, ఆగిందా?

మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండే ప్రభాస్ తో మారుతీ ఈ సినిమాను సైలెంట్ గా, ఫాస్ట్ గా తెరకెక్కిస్తున్నారట

Prabhas - Maruthi Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే . మారుతి మార్క్ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమా...  హారర్ కామెడీ థ్రిల్లర్ గా రానుంది. ఈ మూవీకి 'డీలక్స్ రాజా' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోయిన ప్రభాస్.. ఇప్పుడు తన కెరీర్‌లోనే ఏకైక తక్కువ బడ్జెట్ సినిమాలో నటిస్తుండడం అందర్నీ షాకింగ్ కు గురిచేస్తోంది. ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కె’కు వస్తున్న బజ్.. ఈ మూవీకి లేదు. ఇంతకీ ఈ మూవీ షూటింగ్ జరుగుతుందా? లేదా ఆగిపోయిందా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ సినిమా సైలెంట్ గా, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.

మారుతీ అండ్ టీం ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే దాదాపు సగం పూర్తి చేసుకుందని, మిగిలిన భాగాన్ని కూడా శరవేగంగా చిత్రీకరిస్తున్నారని సమాచారం. అంతేకాదు సినిమా చాలా బాగా రూపుదిద్దుకుంటుందని కూడా సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇది హారర్ కామెడీగా తెరకెక్కుతుండడంతో.. ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాల మధ్య ఈ మూవీ ఓ స్పెషల్ అట్రాక్షన్ లా నిలుస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ మూవీపై.. మారుతి అయితే డార్లింగ్ మీద చాలా కాన్ఫిడెంటే పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రం కోసం భారీ వ్య‌యంతో చిత్ర యూనిట్.. ఓ పాత‌కాలం నాటి థియేట‌ర్ సెట్‌ను కూడా వేసిన‌ట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ కామెడీ క‌థాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న‌ ఈ మూవీలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ పై మాత్రం చిత్ర యూనిట్ సస్పెన్స్ ను అలానే కంటిన్యూ చేస్తోంది. ఇప్పటివరకు టైటిల్‌తో గానీ, షూటింగ్‌, క్యాస్టింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌పై ఎలాంటి అఫీషియ‌ల్ కూడా అనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. లిమిటెడ్ బ‌డ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

ఇక ప్ర‌భాస్ సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 'ప్రాజెక్ట్ కె' సినిమా చేస్తున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం ప్రాజెక్ట్ కె అంటే 'ప్రాజెక్ట్ కాల‌చ‌క్ర' అని టాక్ వినిపిస్తోంది. సినిమా గ‌తానికి, భ‌విష్య‌త్తుకి సంబంధించి కొన‌సాగ‌నుంది కాబ‌ట్టి, ఈ సినిమాకి 'ప్రాజెక్ట్‌ కె’ పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 90% షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ కూడా కొన్ని వారాల్లో పూర్తి కానున్నట్టు సమాచారం. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 

ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో 'సాలార్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే రిలీజైన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు 100 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇక ట్రైలర్ ను వచ్చే నెల ఆగస్టు నెలాఖరులోపు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా నిర్మితమవుతోంది. “సాలార్-ది సీజ్ ఫైర్” అనే ఫ‌స్ట్ పార్ట్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Read Also : Anasuya: జూనియర్ దేవరకొండ ‘చాలా ఇంటెన్స్’- ఇంతకీ అనసూయ తిట్టిందా? పొగిడిందా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
Lenin Trailer: లెనిన్ ట్రైలర్ రివ్యూ... అఖిల్ అక్కినేని విశ్వరూపం... కుమ్మేశాడంతే! 
లెనిన్ ట్రైలర్ రివ్యూ... అఖిల్ అక్కినేని విశ్వరూపం... కుమ్మేశాడంతే!
Akhil Raj Delivery Boy: తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ
తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ
Rahul Ravindran: రాహుల్ రవీంద్రన్ మెడకు కేతన్ - సియా ఘోయల్ మర్డర్ మిస్టరీ... ట్విట్టర్‌కు టాటా
రాహుల్ రవీంద్రన్ మెడకు కేతన్ - సియా ఘోయల్ మర్డర్ మిస్టరీ... ట్విట్టర్‌కు టాటా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget