By: ABP Desam | Updated at : 03 Jun 2023 10:38 AM (IST)
'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై'లో మనోజ్ బాజ్‌పాయి (Photo Credit: Bajpayee Manoj/Instagram)
అతనొక సామాన్యమైన వ్యక్తి. వృత్తి రీత్యా లాయర్. ఓ కేసు విషయంలో అసామాన్యమైన వ్యక్తితో పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ సామాన్యుడికి ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయనేది కూడా బాగా తెలుసు. కానీ, ఓ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సమాజంలో పేరు, ప్రతిష్టలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్న ఓ స్వామీపై పోరాటం చేయటానికి రెడీ అవుతాడు. ఈ పోరారంటో కామన్ మ్యాన్ విజయాన్ని సాధించాడా? లేదా? అనేది తెలియాలంటే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ వెబ్ ఫిల్మ్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా విలక్షణమైన పాత్రలతో తనదైన గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్‌పాయి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భన్సాలి స్టూడియోస్ బ్యానర్స్ పై వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందటంతో జూన్ 7న తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది. వాస్తవ ఘటనలు ఆధారంగా ఈ వెబ్ ఫిల్మ్ ను మేకర్స్ రూపొందించారు. నూసిన్ అనే మైనర్ బాలికతో ఓ స్వామిజీ తప్పుగా ప్రవర్తిస్తాడు. ఆ అమ్మాయి ధైర్యంగా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఆ అమ్మాయికి అండగా లాయర్ సోలంకి (మనోజ్ బాజ్‌పాయి) నిలబడతాడు. అప్పటి వరకు చేసిన పోరాటాలకు.. తానిప్పుడు చేయబోయే పోరాటం ఎంతో వైవిధమ్యైనదో తెలిసాని సోలంకి అమ్మాయికి తన మద్దతుగా ఉంటారు. మరి ఆ కేసులో గెలిచింది ఎవరు? స్వామీజీకి శిక్ష పడిందా? అనేది ఆసక్తికరంగా, ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా చూడాలనే ఎగ్జయిట్మెంట్ మరింత పెంచుతుంది. అందరిలో ఈ సినిమా సోషల్ అవేర్‌నెస్‌ను కలిగించనుంది.
ఈ చిత్రంలో పి.సి.సోలంకి పాత్రలోమనోజ్ బాజ్‌పాయ్, నూసిన్‌గా అడ్రిజ, స్వామిజీగా సూర్య మోహన్, అమిత్ నిహాగ్‌గా నిఖిల్ పాండే, చంచల్ మిశ్రాగా ప్రియాంక సేథియ, నూసిల్ తండ్రి పాత్రలో జైహింద్ కుమార్, నూసిల్ తల్లి పాత్రలో దుర్గా శర్మ తదితరులు నటించారు.
నటుడు మనోజ్ బాజ్ పేయి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. తెలుగులో పలు సినిమాల్లో నటించారు. ‘ప్రేమకథ’, ‘హ్యాపీ’, ‘వేదం’ సినిమాలో చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. వాస్తవానికి మనోజ్ కు మంచి గుర్తింపు ఇచ్చిన చిత్రం ‘సత్య’. ఈ చిత్రంలో ఆయన నటన అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా తర్వాతే ఆయనకు బాగా పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో పాటు, సినిమాలతో ఫుల్ బిజీగా అయ్యారు మనోజ్ బాజ్ పేయి.
Read Also: అమెరికాలో ఒక్క రోజు ముందుగా ఇండియాలో 'ఇండియానా జోన్స్' లేటెస్ట్ మూవీ
Ayalaan Movie: అక్టోబర్ లో టీజర్ విడుదల, సంక్రాంతికి సినిమా రిలీజ్ - ‘అయలాన్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
Madhapur Drugs Case : డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ, ఆరు గంటల పాటు ప్రశ్నల వర్షం !
‘భక్త కన్నప్ప’లో నయన్, విరాట్ బయోపిక్‌లో రామ్ పోతినేని - నేటి టాప్ సినీ విశేషాలివే!
Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?
Akhil Akkineni : తమిళ దర్శకుడితో అఖిల్ అక్కినేని సినిమా?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
/body>