Mirai The Black Sword Glimpse : ‘మిరాయ్’ నుంచి మనోజ్ గ్లింప్స్ విడుదల - ప్రపంచలోని అతీత శక్తుల్లో అతడు ఒకడట
Manchu Manoj Birthday Special : మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా తన లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ విడుదలయ్యింది. ‘మిరాయ్’లో విలన్‌గా గ్రాండ్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు ఈ హీరో.
Manchu Manoj Glimpse From Mirai Is Out Now : మంచు హీరో మనోజ్ పుట్టినరోజుకు ఒక మూవీ అప్డేట్ వచ్చి ఎన్నో ఏళ్లయ్యింది. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్.. గత కొన్నేళ్లుగా వెనకబడ్డాడు. దానికి తన పర్సనల్ లైఫే కారణమని పలుమార్లు బయటపెట్టాడు కూడా. అయితే ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్‌లో అంతా సాఫీగా సాగడంతో బుల్లితెరపై హోస్ట్‌గా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ హీరోను ఇష్టపడే అభిమానులు మాత్రం వెండితెరపై తన రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూశారు. ఫైనల్‌గా ఒక ప్యాన్ ఇండియా మూవీలో విలన్‌గా మంచు మనోజ్.. తన రీఎంట్రీని భారీ రేంజ్‌లో ప్లాన్ చేశాడు.
పుట్టినరోజున అప్డేట్..
తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో ‘మిరాయ్’ అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మంచు మనోజ్.. విలన్‌గా నటిస్తున్నాడని షూటింగ్ ప్రారంభం కాకముందే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని సైతం కన్ఫార్మ్ చేశాడు. మనోజ్ పుట్టినరోజున ఈ మూవీ నుంచి తనకు సంబంధించిన అప్డేట్ వస్తుందని ప్రకటించాడు. ఇక తాజాగా మనోజ్ బర్త్‌డేకు ఒకరోజు ముందు.. అంటే మే 19న ‘మిరాయ్’ నుంచి తన లుక్ ఎప్పుడు రివీల్ అవుతుందో ప్రకటించారు మేకర్స్. వారు చెప్పినట్టుగానే మనోజ్ బర్త్ డే రోజున.. అంటే మే 20న ఏఏఏ సినిమాస్‌లో తనకు సంబంధించిన గ్లింప్స్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.
బ్లాక్ స్వార్డ్..
‘ఇది బ్లాక్ స్వార్డ్’ గురించి అనే డైలాగ్‌తో ‘మిరాయ్’లోని మంచు మనోజ్ క్యారెక్టర్ గ్లింప్స్ మొదలవుతుంది. ‘బ్లాక్ స్వార్డ్ అంటే ప్రపంచంలోని అత్యంత పవర్‌ఫుల్ శక్తులలో ఒకటి’ అంటూ తన క్యారెక్టర్ గురించి చెప్పారు. అప్పుడే కత్తి పట్టుకొని రక్తపాతం సృష్టిస్తున్న మంచు మనోజ్ ఫేస్‌ను రివీల్ చేస్తారు. అంత భీభత్సం సృష్టించిన తర్వాత కూల్‌గా నడుచుకుంటూ మంచు మనోజ్ వెళ్లిపోవడంతో ఈ గ్లింప్స్ పూర్తవుతుంది. ఇక ‘మిరాయ్’తో విలన్‌గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న మంచు మనోజ్ లుక్ పూర్తిగా మారిపోయింది. పొడుగు జుట్టు, స్టైలిష్ లుక్ చూస్తుంటే అసలు ఇతను ఒకప్పుడు మనం చూసిన మంచు మనోజేనా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
ఆకట్టుకున్న గ్లింప్స్..
‘మిరాయ్’ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక గ్లింప్స్ విడుదలయ్యింది. అది ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తేజ సజ్జా గ్రాఫ్ రోజురోజుకీ పెరుగుతుంది అంటూ గ్లింప్స్‌ను చూసిన చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సామ్రాట్ అశోక కళింగ యుద్ధ పరిణామాల తర్వాత రాయబడిన 9 గ్రంథాలు, వాటిని తరతరాలుగా కాపాడుతూ వస్తున్న 9 మంది యోధులు.. అంటూ ‘మిరాయ్’ కథను గ్లింప్స్‌లోనే చెప్పే ప్రయత్నం చేశాడు కార్తిక్ ఘట్టమనేని. ఈ గ్లింప్స్‌లో విజువల్స్ కూడా వావ్ అనిపించేలా ఉన్నాయి. గ్లింప్స్‌తో పాటు ఈ మూవీ విడుదల తేదీని కూడా అప్పుడే ప్రకటించేశారు మేకర్స్. 2025 ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా ‘మిరాయ్’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Also Read: ఇండియన్ 2 రిలీజ్ డేట్ - జూలైలో భారతీయుడిగా కమల్ సందడి ఆ రోజే