Mahesh Babu: ఆకాశాన్ని తాకిన అభిమానం - రియల్ స్టార్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు పేరు
ఆకాశంలో వెలిగే ఒక నక్షత్రానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటూ పేరును రెజిస్టర్ చేయించారు. మహేశ్ అభిమానులు చేసిన ఈ పనికి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు నేపథ్యంలో ఆయన అభిమానులు ఆయనకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. టాలీవుడ్‌లో తొలిసారిగా ఏ హీరోకి దక్కని అరుదైన బహుమతిని అందించారు. తమ అభిమానానికి ఆకాశమే హద్దు అనేలా.. నిజమైన నక్షత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు పేరును నామకరణం చేశారు. వారేవా అనిపించారు.
సింపుల్ స్మైల్‌తోనే యూత్‌లో క్రేజ్..
ఆకాశంలో వెలిగే ఒక నక్షత్రానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటూ పేరును రిజిస్టర్ చేయించారు. మహేశ్ అభిమానులు చేసిన ఈ పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ స్టార్‌కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిమానానికి హద్దులు ఉండవని వీరు మరోసారి నిరూపించారు. ఆన్ స్క్రీన్ మహేశ్ యాక్టింగ్‌కు మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ తన బిహేవియర్‌కు కూడా అభిమానులు ఉన్నారు. ఎప్పుడు సింపుల్‌గా, హుందాగా ఉంటూ సింపిల్ స్మైల్‌తో అమ్మాయిల మనసులు దోచేస్తుంటారు మహేశ్. అందుకే 48 ఏళ్ల వయసొచ్చినా కూడా ఇప్పటికీ చాలామంది అమ్మాయిల క్రష్ లిస్ట్‌లో ఈ సూపర్ స్టార్ కచ్చితంగా ఉంటాడు.
View this post on Instagram
వేలమంది పిల్లల ప్రాణాలు నిలబెట్టాడు..
అసలు ఈ మనిషి చూడడానికి 48 ఏళ్ల వయసు ఉన్నవాడిలాగా లేడు అంటూ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుంది మహేశ్ బాబు అందం. చూడడానికి ఎంత అందంగా కనిపిస్తారో.. అంతకంటే మంచి మనసు కూడా ఆయన సొంతం. గుండె జబ్బులు ఉన్న పిల్లలకు ఆపరేషన్ చేయించడానికి ఆర్థిక స్థోమత లేని ఎంతోమంది తల్లిదండ్రులకు మహేశ్ అండగా నిలిచారు. ఇప్పటికీ ఎన్నో వేలమంది పిల్లలకు ఫ్రీగా హార్ట్ సర్జరీలు చేయించి వారి ప్రాణాలను కాపాడాడు. ఇది మాత్రమే కాదు.. ఎప్పటికప్పుడు మరెన్నో ఇతర ఛారిటీ ప్రోగ్రాంలకు కూడా సాయంగా నిలబడతాడు ఈ సూపర్ స్టార్. తండ్రికి తగ్గ తనయుడు అని ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా నిరూపించుకున్నాడు.
థియేటర్లలో ‘బిజినెస్‌మెన్’ సందడి..
సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్‌డే స్పెషల్‌గా థియేటర్లలో ‘బిజినెస్‌మెన్’ మూవీ రీ రిలీజ్ అయ్యింది. ఉదయం నుండి థియేటర్ల దగ్గర మహేశ్ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ఇప్పటికే ‘బిజినెస్‌మెన్’ రీ రిలీజ్ ప్రీ బుకింగ్స్.. పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ చిత్రాన్ని దాటేశాయని టాక్. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈ రీ రిలీజ్ చిత్రం కచ్చితంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని మహేశ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో పాటు మహేశ్ తరువాతి చిత్రం ‘గుంటూరు కారం’ నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్‌లో లుంగీ కట్టుకొని, స్టైల్‌గా బీడీ తాగుతున్నాడు మహేశ్. ఇప్పటికే విడుదలయిన ‘గుంటూరు కారం’ గ్లింప్స్‌లో కూడా మహేశ్ బీడీ తాగుతూనే కనిపించాడు. ఈ లుక్స్, గ్లింప్స్ చూస్తుంటే ఈ మూవీ కచ్చితంగా మాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చేలా ఉందని నిపుణులు అనుకుంటున్నారు.
Also Read: దర్శకులను ఎక్సేంజ్ చేసుకుంటున్న చిరంజీవి, బాలకృష్ణ - సీనియర్ హీరోలు పెద్ద ప్లానే వేశారుగా!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial