Love Me: లవ్ మీ... వేసవిలో ప్రేక్షకుల ముందుకు, దెయ్యంతో ప్రేమకథ విడుదల ఎప్పుడంటే?
Love Me Release Postponed: ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన హారర్ థ్రిల్లర్ 'లవ్ మీ' విడుదల ఓ నెల వాయిదా పడింది.
'రౌడీ బాయ్స్' సినిమాతో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుని కుమారుడు, శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతో మంచి పేరు, విజయం అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'లవ్ మీ'. 'బేబీ'తో యువతను ఆకట్టుకోవడంతో పాటు భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదు. ఓ నెల వెనక్కి వెళ్లింది.
మే 25న 'లవ్ మీ' సినిమా విడుదల
Ashish and Vaishnavi Chaitanya's Love Me Gets New Release Date: ఎస్... 'లవ్ మీ' సినిమాను మే 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సంస్థ ఈ రోజు అనౌన్స్ చేసింది. 'బలగం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది.
దెయ్యంతో యువకుడి ప్రేమకథ
'లవ్ మీ' చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి నిర్మాతలు. ఇఫ్ యు డేర్... అనేది ఉప శీర్షిక. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది.
Also Read: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!
'భయం వేసే చోట రొమాన్స్ ఇంకా ఎగ్జైటింట్‌గా ఉంటుంది ప్రియా' అని హీరో ఆశిష్ చెప్పే మాటతో 'లవ్ మీ' టీజర్ మొదలైంది. 'అలా అని దెయ్యంతో రొమాన్స్ చేయలేవు కదా అర్జున్?' - అతడికి ప్రియా నుంచి ప్రశ్న ఎదురైంది. 'ఒక్కసారి డేట్‌కి పిలిస్తే కదా తెలిసేది' అని అర్జున్ చెప్పడంతో ప్రియా హెచ్చరిస్తుంది. ఆ దెయ్యాన్ని చూడటానికి వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రాలేదని, ఆ దెయ్యాన్ని రెండుసార్లు చూడలేమని చెబుతుంది. దెయ్యాన్ని ప్రేమించాలని అనుకుంటున్నట్లు హీరో చెబుతాడు. ఆ దెయ్యం దగ్గరకు హీరో వెళ్లిన తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 'లవ్ మీ'లో ప్రేమకథతో పాటు హారర్ అంశాలు ఉన్నాయని టీజర్ చూస్తే తెలుస్తోంది.
Also Read: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ రెడీ - లంక రత్నగా విశ్వక్ సేన్ మాస్ రేజ్ వచ్చేది ఆ రోజే
'లవ్ మీ' చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆడియో జ్యూక్ బాక్స్ ఆల్రెడీ విడుదలైంది. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 'లవ్ మీ' సినిమాలో ఒక పాటను ఏఐ టెక్నాలజీ ద్వారా పాడించడం ఓ స్పెషాలిటీ. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ వంటి స్టార్ సినిమాటోగ్రాఫర్ వర్క్ చేయడం మరో స్పెషాలిటీ. ఆశిష్, వైష్ణవి చైతన్య తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్, నిర్మాతలు: హర్షిత్ రెడ్డి - హన్షితా రెడ్డి - నాగ మల్లిడి, దర్శకుడు: అరుణ్ భీమవరపు.