Vijayakanth: మరణాంతరం 'కెప్టెన్' విజయ్ కాంత్‌కు 'పద్మభూషణ్' - అవార్డుని వారికి అంకితం ఇచ్చిన ఆయన భార్య
Vijayakanth: మరణాంతరం దివంగత నటుడు విజయ్ కాంత్ కు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. కేంద్రప్రభుత్వం గురువారం సాయంత్రం పద్మ అవార్డులని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Captain Vijayakanth Conferred Padma Bhushan Award: రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్రప్రభుత్వం గురువారం సాయంత్రం పద్మ అవార్డులని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో మన తెలుగు తేజాలు ఉండటం విశేషం. ఈసారి దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడుకు పద్మవిభూషన్ అవార్డు వరించింది. ఇదిలా ఉంటే మరణాంతరం ఓ స్టార్ హీరో పద్మభూషన్ అవార్డుకు ఎంపికవ్వడం విశేషం. ఆయనే దివంగత నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్.
ఒకప్పటి తమిళ స్టార్, రాజకీయ నేత దివంగత 'కెప్టెన్' విజయ్ కాంత్ కి పద్మ భూషణ్ అవార్డుని ప్రకటించింది కేంద్రప్రభుత్వం. నటుడిగా ఆయన తమిళ సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించారు. ఎన్నో సినిమాలతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా అలరించి హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించారు. నటుడిగా కూడా పలు సామాజీక సేవలు అందించేవారు. నటన అనంతరం కూడా రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేశారు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన ఆయన గత ఏడాది డిసెంబర్ 28న మరణించారు. ఇప్పుడు మరణానంతరం ఆయనకు పద్మభూషణ్ రావడంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తుంటే.. ఫ్యాన్స్‌ని మాత్రం మరింత వేదనకు గురిచేస్తుంది.
Also Read: 'పద్మవిభూషణ్' చిరంజీవికి అభినందనల వెల్లువ.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎన్నికైన విజయ్‌కాంత్ ప్రస్తుతం మన మధ్య లేకపోవడం విచారమని, మరణాంతరం ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరోవైపు ఆయనకు పద్మభూషణ్ ప్రకటించడంపై కుటుంబ సభ్యులు, తమిళ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విజయ్ కాంత్ భార్య ప్రేమలత విజయ్ కాంత్ స్పందిస్తూ కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక అవార్డుని విజయకాంత్‌ని ప్రేమించే ప్రతి ఒక్కరికి, ఆయన అభిమానులకు అంకితం చేస్తున్నామని ఆమె అన్నారు.
అలా 'కెప్టెన్' విజయ్‌కాంత్‌గా మారారు
'కెప్టెన్ ప్రభాకరన్' సినిమా విజయ్‌కాంత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో నటుడిగా విజయ్ కాంత్ స్థాయిని మరో మెట్టులో నిలబెట్టింది. దాంతో అప్పటి నుంచి విజయ్ కాంత్‌ను అ'కెప్టెన్'గా పిలవడం మొదలు పెట్టారు. అనంతరం చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలకు, 'కెప్టెన్ ప్రభాకరన్'తో ఆయన సాధించిన అసాధారణ విజయానికి గుర్తింపుగా నటీనటుల సంఘం అధ్యక్షుడిగా విజయ్ కాంత్‌ను ఎన్నికున్నారు.
100వ సినిమా హిట్
1991లో విడుదలైన 'కెప్టెన్ ప్రభాకరన్' మూవీ విజయ్ కాంత్‌కు ఒక సినిమా మాత్రమే కాదు. తమిళ సినిమాల్లో ఇప్పటి వరకు సాటిరాని రికార్డును నెలకొల్పిన సినిమా కెప్టెన్ ప్రభాకరన్. అయితే ఈ మూవీ విజయ్ కాంత్‌కు 100వ సినిమా. కెప్టెన్ ప్రభాకరన్ మూవీ విజయం కావడమే కాకుండా విజయ్ కాంత్ కంటే ముందుగా ఏ నటుడూ కూడా తన 100వ సినిమా హిట్ కావడాన్ని చూడలేదు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన హీరోగా విజయ్ కాంత్‌కు పేరు వచ్చింది.