Rambha Latest Look : రంభ ఇంట్లో ఖుష్బూ - అప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి
హీరోయిన్ రంభ గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారో చూడండి!
రంభ... ఓ తరానికి డ్రీమ్ గాళ్! కలల కథానాయిక! మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, జీడీ చక్రవర్తి తదితరులతో హిట్ సినిమాలు చేశారు. అందంతో, అభినయంతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారో చూశారా?
ఇప్పుడు రంభ సినిమాలు చేయడం లేదు. ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తూ... పిల్లలతో బిజీ బిజీగా ఉన్నారు. నిజం చెప్పాలంటే... లైమ్ లైట్‌లో లేరు. ఆవిడను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు ఖుష్బూ.
రంభ, ఆమె పిల్లలతో దిగిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''పాత స్నేహితులను కలవడం, సరదాగా నవ్వడం, బిర్యానీ తినడం కంటే మంచి ఫీలింగ్ ఏదీ ఉండదు. పిల్లల మధ్య బాండింగ్ కూడా బలపడినప్పుడు... వాళ్ళు కలిసినప్పుడు ఇంకా బావుంటుంది. చెన్నైలో ఓ సాయంత్రం వేళ రంభ ఇంట్లో సరదాగా టైమ్ స్పెండ్ చేశాం'' అని ఖుష్బూ పేర్కొన్నారు.
Also Read : పెళ్లి కాకుండా అషు రెడ్డి శృంగారం చేసిందా? వర్జిన్ ప్రశ్నకు 'బిగ్ బాస్' బ్యూటీ ఆన్సర్ ఏంటంటే?
చిరంజీవితో 'బావగారూ బాగున్నారా?', బాలకృష్ణతో 'భైరవ ద్వీపం', నాగార్జునతో 'హలో బ్రదర్', వెంకటేష్ సరసన 'ముద్దుల ప్రియుడు', జేడీ చక్రవర్తితో 'బొంబాయి ప్రియుడు' తదితర సినిమాల్లో రంభ నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'యమదొంగ', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'దేశముదురు' సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించారు. కొన్నాళ్లుగా ఆమె నటనకు దూరంగా ఉన్నారు.
Also Read : ప్రభాస్, కీర్తి సురేష్, కొహ్లీల ‘హర్ ఘర్ తిరంగా’ సాంగ్, మనసంతా భారతీయమే!
View this post on Instagram