Prabhas : ప్రభాస్కు కేటీఆర్ ప్రాంక్ కాల్ - డార్లింగ్‌తో పిల్లల క్యూట్ ఫన్
KTR : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్ చేశారు. పిల్లలతో టాక్ షోలో పాల్గొన్న ఆయన వారి కోరిక మేరకు డార్లింగ్‌కు కాల్ చేసి ఆయనతో మాట్లాడారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

KTR Prank Call To Prabhas : ఎప్పుడూ పాలిటిక్స్‌లో బిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ప్రాంక్ కాల్ చేశారు. ఊహించని ఈ కాల్‌తో డార్లింగ్ అవాక్కయ్యారు. అసలేం జరిగిందంటే...
'ఈ మొబైల్ దొరికింది'... ప్రభాస్ రియాక్షన్
కేటీఆర్ రీసెంట్‌గా 'ది అండర్ 18 వరల్డ్' అనే యూత్ టాక్ షో పాడ్ కాస్ట్‌లో పాల్గొన్నారు. అక్కడున్న పిల్లలు కేటీఆర్‌కు ఓ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ విసిరారు. మీ పర్సనల్ ఫోన్ నుంచి ఎవరైనా స్టార్ హీరోకు కాల్ చేయాలని అడగ్గా... కేటీఆర్ ప్రభాస్‌కు కాల్ చేశారు. డార్లింగ్ ఫోన్ ఎత్తగానే... వెంటనే పక్కనున్న పాప ఫోన్ అందుకుని... 'సార్ నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొబైల్ దొరికింది. ఇందులో చూస్తే మీ నెంబర్ కనిపించింది. ఇంతకీ నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా.' అంటూ ప్రశ్నించింది.
దీంతో పక్కనే ఉన్న కేటీఆర్ తల పట్టుకున్నారు. అవతల ప్రభాస్‍కు ఏమీ అర్థం కాక కాల్ కట్ చేశారు. దీంతో నవ్వులు పూయగా... 'అలా చేయకూడదు' అంటూ కేటీఆర్ పిల్లలకు చెప్పి మళ్లీ ప్రభాస్‌కు కాల్ చేసి అసలు విషయం చెప్పారు. 'తాను ది అండర్ 18 వరల్డ్ పాడ్ కాస్ట్ షోలో ఉన్నానని... పిల్లల కోరిక మేరకు సరదాగా కాల్ చేశాను.' అని తెలిపారు. ఇది విన్న ప్రభాస్ సరదాగా ఆయనతో మాట్లాడారు. త్వరలోనే తాను కూడా పిల్లలను కలుస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#KTR & #Prabhas – A Fun PRANK Call…!! 😂❤️
— Rangasthalam (@RangasthalamIN) September 11, 2026
KTR was asked to prank call some Telugu STARS on the #Under18 show.
He tried calling #Prabhas, #MaheshBabu, #Nani and a few others, but no one answered.
But #Prabhas called him back later. pic.twitter.com/J3wJ13UjpB
ట్రెండింగ్ వార్తలు























