అన్వేషించండి

Kiran Abbavaram: ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' - స్మైల్ విత్ మాస్ లుక్ చూశారా!

K RAMP Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. లేటెస్ట్ మూవీ 'కే ర్యాంప్'లో ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.

Kiran Abbavaram First Look In K RAMP Movie: రీసెంట్‌గా 'క' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నారు. ఈ మూవీకి 'కే ర్యాంప్' అనే యూనిక్ టైటిల్ ఫిక్స్ చేయగా తాజాగా హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. డిఫరెంట్‌గా మాస్ స్టైల్‌లో కిరణ్ లుక్ అదిరిపోయింది.

మాస్ గెటప్‌తో...

'కే ర్యాంప్' మూవీలో మాస్ గెటప్‌తో కిరణ్ అబ్బవరం అదరగొట్టారు. చొక్కా, లుంగీ ధరించి నవ్వుతూ డ్యాన్స్ చేయగా... వెనుక లవ్ సింబల్‌తో ఫైర్ ఎఫెక్ట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. స్టైల్‌తో పాటు ఫైర్, ఫన్ కలగలిపేలా మూవీ ఉండబోతోందని పోస్టర్ బట్టి అర్థమవుతోంది. ఫస్ట్ లుక్‌తోనే హైప్ క్రియేట్ చేయగా... మరోసారి హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ చిత్రంతోనే జైన్స్ నాని దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కిరణ్, చేతన్ కాంబోలో ఇది మూడో చిత్రం. ఇంతకు ముందు వచ్చిన 'ఎస్ఆర్ కల్యాణమండపం', 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీస్ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి.

దీపావళికి రిలీజ్

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఈ దీపావళికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పోస్టర్‌తోనే మాస్ హైప్ క్రియేట్ చేయగా... టెక్నికల్ టీం నుంచి కాస్ట్యూమ్స్ వరకూ ప్రతి విభాగంలోనూ 'కే ర్యాంప్' మూవీ టీం స్పెషల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: 'జయమ్ము నిశ్చయమ్ము రా: జగపతి బాబుతో 'జీ తెలుగు' కోసం 'కల్కి 2898 ఏడీ' నిర్మాణ సంస్థ కొత్త షో - ప్రోమో చూడండి

వరుస సినిమాలు

'క' మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన లాస్ట్ మూవీ 'దిల్ రూబా' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం కిరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా లవ్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా... సాయి రాజేష్ స్టోరీ అందించారు. కిరణ్ సరసన శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా చేస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా 'కే ర్యాంప్'తో రాబోతున్నారు. 'క' మూవీకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
This Week OTT Movies : దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు
దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget