Kantara Chapter 1 English Release Date: ఇంగ్లీష్‌లో కాంతార... రిలీజ్ డేట్ ఫిక్స్ - రన్ టైమ్ ఎంత తగ్గిందో తెలుసా?
Kantara Chapter 1 Release In English: రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార ఛాప్టర్ 1'ను ఇంగ్లీష్ లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది టీం.

'కాంతార'కు ప్రీక్వెల్‌గా వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1' సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 3న సినిమా విడుదలైంది. అక్టోబర్ 1వ తేదీ రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. భారతీయ భాషల్లో భారీ విజయం సాధించడంతో పాటు వసూళ్లు రాబట్టిన ఈ సినిమాను ఇంగ్లీష్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది టీం.
అక్టోబర్ 31న ఇంగ్లీష్‌లో విడుదల!
Kantara Chapter 1 English Dub Release Date: అక్టోబర్ 31న 'కాంతార ఛాప్టర్ 1'ను ఇంగ్లీష్‌లో విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ రోజే థియేటర్లలోకి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి: ది ఎపిక్' విడుదల కానుంది. అలాగే మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' సైతం విడుదల కానుంది.
ఇంగ్లీష్ కోసం కొన్ని సీన్లకు కత్తెర!
'కాంతార ఛాప్టర్ 1' ఇంగ్లీష్ రిలీజ్ కోసం కొన్ని సన్నివేశాలకు కత్తెర వేశారు. ఈ సినిమాను భారతీయ భాషల్లో విడుదల చేసినప్పుడు 169 నిమిషాల (రెండు గంటల 49 నిమిషాల)తో విడుదల చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ కోసం అరగంటకు పైగా కత్తెర వేశారు. 'కాంతార ఛాప్టర్ 1' ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ రన్ టైమ్ 2.14 గంటలు మాత్రమే. అంటే 35 నిమిషాల సీన్స్ తీసేశారు.
Also Read: బాక్సాఫీస్ బాహుబలి... అప్ కమింగ్ మూవీస్ @ 4000 కోట్లు - ఎవ్వరికీ అందనంత ఎత్తులో ప్రభాస్
View this post on Instagram
'కాంతార ఛాప్టర్ 1'లో రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించడం మాత్రమే కాదు... ఆ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్. ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ థియేటర్లలో ప్రేక్షకులు అందరికీ షాక్, సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇంకా జయరామ్, గుల్షన్ దేవయ్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేశారు.





















