అన్వేషించండి

Kamal Haasan: నన్ను ఇకపై అలా పిలవొద్దు... అభిమానులకు కమల్ స్పెషల్ రిక్వెస్ట్ - ఎక్స్‌లో వైరల్ పోస్ట్ 

ఇకపై అలా పిలవొద్దు అని కోరుతూ అభిమానులకు కమల్ హాసన్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ ఈ మేరకుఎక్స్ లో పోస్ట్ చేశారు.  

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తమ అభిమాన నటీనటులను స్పెషల్ ట్యాగ్ తో పిలుచుకుని సంబర పడతారు ఫ్యాన్స్. అతికొద్ది మంది సెలబ్రిటీలు తప్ప మంచి స్టార్ డమ్ ఉన్న పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న చిన్న హీరోలు కూడా ఇటీవల కాలంలో ఇలా స్పెషల్ ట్యాగ్స్ తగిలించుకొని మరీ పిలిపించుకుంటున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ మాత్రం ఈ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఆయన ఇకపై తనను ఎవ్వరూ ఎలాంటి స్టార్ ట్యాగ్ తో పిలవద్దంటూ షాక్ ఇచ్చారు. తనని కేవలం కమల్ లేదా కమల్ హాసన్ అని పిలిస్తే చాలని తెలుపుతూ స్పెషల్ గా ఓ లెటర్ ను రిలీజ్ చేశారు. అయితే కమల్ హాసన్ తాను సినీ ప్రియులకు మరెన్నో అద్భుతమైన సినిమాలను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ లెటర్లో వెల్లడించారు. అంతే కాకుండా ఎవ్వరూ తన నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఎక్స్ వేదికగా ఆయన సోమవారం పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

ఆ లెటర్లో కమల్ హాసన్ 'నా పనిని మెచ్చి ఎన్నో బిరుదులను అందించిన వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను. ఉలగనాయగన్ వంటి బిరుదు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక తోటి నటీనటులతో పాటు ఆత్మీయుల నుంచి వచ్చే ఇలాంటి ప్రశంసలు ఎన్నో నా మనసును ఎంతగానో కదిలించాయి. ఏ ఒక్కరి ఊహకు అందని సినిమా ప్రపంచంలో నేను నిత్య విద్యార్థిని. ఈ రంగంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుని మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఇతర కళల మాదిరిగానే సినిమా కూడా అందరికీ చెందిన కళ. సినిమా ఇండస్ట్రీ అనేది ఎంతోమంది సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు, కళాకారుల సహకారం. నా అభిప్రాయం ప్రకారం కళకంటే కళాకారుడు గొప్ప కాదు. నేను ఎప్పటికీ నా లోపాలను గుర్తించి మరింత మెరుగుపరుచుకుంటూ, నటుడిగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, స్థిరంగా ఉండాలని అనుకుంటున్నాను. బాగా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాను.. నేను మర్యాదపూర్వకంగా స్టార్ ట్యాగ్స్ ను తిరస్కరిస్తున్నాను. నా అభిమానులతో పాటు మీడియా, సినీ ప్రముఖులు, భారతీయులందరూ నన్ను కేవలం కమల్ లేదా కమల్ హాసన్ లేదా కేహెచ్ అని పిలవాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను" అంటూ సుదీర్ఘ నోట్ ను రిలీజ్ చేశారు. 

అయితే స్టార్ హీరోలు ఇలా ట్యాగ్స్ పై వ్యతిరేకతను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తనని కేవలం అజిత్ కుమార్ లేదా అజిత్ లేదా ఏకే అని పిలిస్తే చాలని అన్నారు. అలాగే తెలుగులో నాని కూడా తనను నేచురల్ స్టార్ అని పిలవొద్దు అని అన్నారు. వీళ్లిద్దరు మాత్రమే కాదు సంయుక్త మీనన్ కూడా తనను ఇంటిపేరుతో పిలవద్దు కేవలం సంయుక్త అని పిలిస్తే చాలని కోరింది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో కమల్ కూడా చేరడం విశేషం.

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Embed widget