అన్వేషించండి

Kalyan Ram 'Devil' OTT Release: రిలీజైన రెండు వారాలకే ఓటీటీకి వచ్చేసిన స్టార్‌ హీరో సినిమా - స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Kalyan Ram Devil OTT Streaming: కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ సైలెంట్ గా ఓటీటీకి వచ్చింది. థియేటర్లో విడుదలైన రెండు వారాలకే ఈ మూవీ ఓటీటీకి రావడం గమనార్హం. ప్రస్తుతం ఆమెజాన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

Devil OTT Streaming:  'బింబిసార' మూవీ నుంచి నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ దూకుడు పెంచాడు. హిట్‌ ప్లాప్స్‌తో సంబంధంగా లేకుండ వరుస సినిమాలు చేస్తున్నాడు. వైవిధ్యమైన కథ, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో లేటెస్ట్‌గా 'డెవిల్‌' అనే మూవీతో వచ్చాడు. బ్రిటిష్‌ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా ఎన్నో అంచనాల మధ్య గతేడాది డిసెంబర్‌  29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. బ్రిటిష్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌గా డెవిల్‌ పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ పర్పామెన్స్‌ వావ్‌ అనిపించింది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెల్స్‌లో అదరగోట్టాడు. కానీ మూవీ మాత్రం ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా యావరేజ్‌ టాక్‌కు పరితమైన ఈ సినిమా థియేటర్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.

రెండు వారాల్లోనే ఓటీటీకి 

అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రెడీ అయ్యింది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైంలోకి వచ్చేసింది. నిన్న  డెవిల్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రిలీజ్ డేట్‌ ప్రకటించింది అమెజాన్‌ ప్రైం. జనవరి 14 అంటే నేటి నుంచి డెవిల్‌ అమెజాన్ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. స్టార్‌ హీరో సినిమా, బిగ్‌ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి రావడం గమనార్హం. ఇక సైలెంట్‌గా డెవిల్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించి డిజిటల్‌ ప్రియులను సర్‌ప్రైజ్‌ చేసింది అమెజాన్‌ ప్రైం. మరి థియేటర్లో ఈ సినిమా చూడని వారు ఈ సంక్రాంతి పండుగకు ఇంట్లోనే ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి. ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌పై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంతో నిర్మించారు. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ సరసన సంయుక్తా మీనన్‌, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటించారు. 

'సలార్' మేనియా ముందు నిలవలేకపోయిన 'డెవిల్'

సాధారణంగానే కళ్యాణ్‌ రామ్‌ సినిమా అంటే హైప్‌ ఉంటుంది. అతడి సినిమాల్లో కామెడీతో కొత్త కంటెంట్ ఉంటుంది. అలా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన డెవిల్‌ ఒపెనింగ్స్‌ కూడా బాగానే ఇచ్చింది. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ చూసి మేకర్స్‌ హ్యాపీ అయ్యారు. కానీ అదే టైంలో 'సలార్‌' మూవీ రిలీజ్‌ అయ్యింది. పాన్‌ ఇండియా సినిమా క్రేజ్‌, ప్రభాస్‌ మేనియా ముందు డెవిల్‌ నిలవలేకపోయింది. ఓవరాల్‌గా థియేట్రికల్‌ రన్‌లో డెవిల్‌ సినిమా రూ. 23 కోట్ల వరకు వసూళ్లు చేసినట్టు సమాచారం. ఇక సంక్రాంతికి కొత్త సినిమాల సందడి ఉండటంతో రెండు వారాలకే డెవిల్‌ థియేట్రికల్‌ రన్‌ కంప్లీట్‌ చేసుకుంది. 

Also Read: ఏదైనా అతిగా చేయొద్దు, నన్నేమైనా ఉద్యోగంలో పెట్టుకున్నాడా - పల్లవి ప్రశాంత్‌పై శివాజీ వ్యాఖ్యలు

'డెవిల్‌ 2' ఎప్పుడంటే..

డెవిల్‌ మూవీ రిలీజ్‌ సందర్భంగా దీనికి సీక్వెల్‌ కూడా ఉందని కళ్యాణ్‌ రామ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూవీ ఫంక్షన్‌ కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. డెవిల్‌ 2 కూడా ఉంటుందన్నాడు. 2024లో డెవిల్‌ 2 షూటింగ్‌ మొదలుపెట్టి 2025లో రిలీజ్‌ చేస్తామని చెప్పాడు. ఈ సీక్వెల్‌ 1940 ఎరా నుంచి 2000 ఎరా కూడా కనిపిస్తుందన్నాడు. ఈరెండు కాలాలు కలిపి చూడబోతున్నామని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే కళ్యాణ్‌ రామ్‌ మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. తన 21సినిమాను ఓ డెబ్యూ డైరెక్టర్‌తో కమిట్‌ అయ్యాడు. NKR21 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్వరలోనే మూవీ డైరెక్టర్‌తో మరిన్ని వివరాలను టీం వెలడించనుందని సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget