అన్వేషించండి

NTR Devara: మరో భారీ సీక్వెన్స్‌కు ‘దేవర’ రెడీ - క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు!

‘దేవర’ నుండి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది.

‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తను నటిస్తున్న ‘దేవర’ హిట్ అవ్వాల్సిందే అని కష్టపడుతున్నాడు. కొన్నాళ్ల విరామం తర్వాత ‘దేవర’ నుండి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

కొత్త షెడ్యూల్ షురూ!

దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యిందంటూ మూవీ తన అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘చిన్న బ్రేక్, కొన్ని రిహార్సెల్స్ తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వచ్చేశాం’ అని మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటికే ‘దేవర’ క్యాస్టింగ్‌తో ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ చిత్రంతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మొదటిసారిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. తమిళ రాక్‌స్టార్ అనిరుధ్.. దేవరకు మ్యూజిక్‌ను అందించనున్నాడు. అంతే కాకుండా సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే దసరా లాంటి కమర్షియల్ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన షైన్ టామ్ చాకో కూడా దేవరలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘దేవర’.. 2024 ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. 

‘ఆర్ఆర్ఆర్’లో ఎన్‌టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంవత్సరం క్రితం విడుదలయిన సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌తో పాటు ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌ల నటన కూడా ఒక కారణమే. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో ఎన్‌టీఆర్ నటన చూసి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక అలాంటి నటన చూసిన ప్రేక్షకులు ఎన్‌టీఆర్ నుండి మరింత ఎక్కువ ఆశించడం మొదలుపెట్టడంతో తనపై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత తనకు ‘జనతా గ్యారేజ్’ లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో ‘దేవర’ చేయడానికి సిద్ధమయ్యాడు.

కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’.. ప్రకృతి గురించి ప్రేక్షకులకు మెసేజ్ ఇస్తూనే మాస్ ఎంటర్‌టైనర్‌గా అలరించింది. మెసేజ్‌ను మాస్ స్టైల్‌లో చూపించడం కొరటాల శివకు అలవాటే. అందుకే తనతోనే మళ్లీ సినిమా చేయడానికి ఎన్‌టీఆర్ ముందుకొచ్చాడు. ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుంది అని తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకే ఇప్పటికే దేవరపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటివరకు దేవర నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ తప్పా మరొక అప్డేట్ బయటికి రాలేదు.

Also Read: నటి శోభన ఇంట్లో చోరీ - ఆమె చేసిన పనికి అంతా ఆశ్చర్యం!

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి A రేటెడ్ రొమాంటిక్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Idupu Kayitham Srilatha Song Promo : ఇడుపు కాయితం సాంగ్ ప్రోమో - ప్రియదర్శి, నాగదుర్గ మధ్య లవ్ రొమాంటిక్ సింగిల్
ఇడుపు కాయితం సాంగ్ ప్రోమో - ప్రియదర్శి, నాగదుర్గ మధ్య లవ్ రొమాంటిక్ సింగిల్
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Embed widget