అన్వేషించండి

Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!

Jr NTR-Devara: దేవర మూవీ టీం షాకిచ్చింది. ఈ చిత్రంలో క్రేజ్‌ పాటను రిలీజ్‌ చేస్తున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అంతలోనే మేకర్స్‌ మనసు మార్చుకుని ఆ పాటను విడుదలను ఆపేశారు. 

Devara Ayudha Pooja Postponed: ఫ్యాన్స్‌, ఆడియన్స్‌కి 'దేవర' టీం షాకిచ్చింది. అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్రేజీ అప్‌డేట్‌ రావడం లేదంటూ బ్యాడ్‌న్యూస్‌ చెప్పింది. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్ జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం 'దేవర'. రెండు భాగాలుగా వస్తున్న దేవర ఫస్ట్‌ పార్ట్‌ సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రమిది.

మరో 8 రోజుల్లో థియేటర్లోకి

అలాగే జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత కొరటాల-ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్‌, సాంగ్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఆడియన్స్‌ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా పాటలు యూట్యూబ్‌లో మారుమోగుతున్నాయి. ఇక ట్రైలర్‌తో మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్‌కు ఇంకా 8 రోజులే ఉంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది దేవర టీం. మూవీ నుంచి నాలుగో పాటను రిలీజ్‌ చేస్తున్న నిన్న ఓ ప్రకటన ఇచ్చింది. ఆయుధ పూజకు సిద్ధం అవ్వండి అంటూ ప్రేక్షకులను అలర్ట్‌ చేశారు.

ఆయుధ పూజ వాయిదా

సెప్టెంబర్‌ 19న ఉదయం 11.07 గంటలకు ఆయుధ పూజ వచ్చేస్తుందంటూ బజ్‌ పెంచారు. దీంతో ఈ పాటకు ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఊహించని షాక్‌ ఇచ్చింది టీం. ఆయుధ పూజ రేపు రావడం లేదంటూ ఫ్యాన్స్‌ ఆశలను నీరుగార్చింది. "ఆయుధ పూజ అనేది పూర్తి స్థాయిలో ఘనంగా జరుపుకోవాల్సిన ఒక మ్యాడ్‌ సాంగ్‌. కనుక రేపు పాట విడుదల కాదు" అంటూ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. కానీ, మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్‌ చేయమని, మీ ఎదురుచూపులకు తగిన ప్రతిఫలం అందిస్తామంటూ ఫ్యాన్స్‌కి హామి ఇచ్చింది దేవర టీం.

ప్రోమో ప్లీజ్‌

ఇది చూసి కొందరు నెటిజన్లు కనీసం సాంగ్‌ సంబంధించి ప్రొమో అయినా, చిన్న బిట్‌ అయినా ఇవ్వండి అంటూ రిక్వెస్ట్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం పాటను వాయిదా వేశారా? లేక రిలీజ్‌నే ఆపేశారా? అని ఆరా తీస్తున్నారు. అయితే థియేటర్లో డైరెక్ట్‌గా రచ్చేనా? రెండు బ్లాస్ట్‌ థియేటర్లోనే అన్నమాట అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దేవరలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ ప్రతికథానాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.

Also Read: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget