అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jr NTR: ఎన్‌టీఆర్ చిన్నప్పటి వీడియో వైరల్ - క్యూట్‌గా ఉన్నాడంటూ మురిసిపోతున్న ఫ్యాన్స్

Jr NTR: జూనియర్ ఎన్‌టీఆర్ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1997లోని ఈ వీడియోలో ఎన్‌టీఆర్‌ను చూసి ఫ్యాన్స్ అంతా.. తను క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jr NTR Childhood Video: సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని వారు పోస్ట్ చేయకపోయినా ఏదో ఒక విధంగా ఆ ఫోటోలు, వీడియోలు అనేవి బయటికొస్తూనే ఉంటాయి. అలాగే తాజాగా ఎన్‌టీఆర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్‌టీఆర్ ఫ్యాన్ ఒకరు 1997లో ఈ హీరో ఒక ఈవెంట్‌లో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఎన్‌టీఆర్ అప్పట్లో చాలా క్యూట్‌గా ఉన్నారంటూ దీనిని తన ఫ్యాన్స్ అంతా తెగ షేర్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది.

అప్పటి వీడియో..

నందమూరి కుటుంబం నుండి సినీ పరిశ్రమకు పలువురు వారసులు వచ్చారు. అందులో ప్రస్తుతం ఎన్‌టీఆర్ మాత్రమే ప్యాన్ ఇండియా స్థాయి పాపులారిటీతో దూసుకుపోతున్నారు. ఇక చిన్నప్పటి నుండే ఆర్ట్స్ అంటే ఎన్‌టీఆర్‌కు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. అందుకే క్లాసికల్ డ్యాన్సర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తాజాగా 1997కు చెందిన ఎన్‌టీఆర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో యూకేలోని మాంచెస్టర్‌లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్‌లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నాడు. ఈవెంట్‌లో ఇంకా చాలామంది టాలీవుడ్ నటీనటులు, సింగర్స్ పాల్గొన్నారు.

అదే సంవత్సరం..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో సీనియర్ నటి శారద పక్కనే కూర్చొని ఉన్నాడు ఎన్‌టీఆర్. అంతే కాకుండా ఇందులో మరో హైలెట్ ఏంటంటే ఇందులో తను నిక్కర్ వేసుకొని కనిపించాడు. దీంతో ఎన్‌టీఆర్ అప్పట్లో చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. 1997లోనే ‘బాలరామాయణం’లో రాముడిగా కనిపించాడు ఎన్‌టీఆర్. ఇక అదే సంవత్సరంలో మాంచెస్టర్‌లో యూరోపియన్ తెలుగు అసోసియేషన్‌ మీటింగ్ జరిగింది. ఇక ఆ మూవీ తర్వాతే ఎన్‌టీఆర్ ఈ మీటింగ్‌లో పాల్గొన్నాడని అర్థమవుతోంది. అప్పటికే తాను కూడా ఒక ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

రెండేళ్లు గ్యాప్..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్‌టీఆర్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ ఈ మూవీ విడుదలయ్యి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎన్‌టీఆర్ నుండి మరో సినిమా రాకపోవడం అనేది ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ హీరో.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే ‘దేవర’ మూవీ చాలాసార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. ఫైనల్‌గా అక్టోబర్ నుండి ప్రీపోన్ అయ్యి సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో ‘దేవర’తో ఎన్‌టీఆర్‌ను మళ్లీ ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై చూడాలా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు ఈ ఏడాదిలోనే బాలీవుడ్ డెబ్యూకు కూడా సిద్ధమయ్యాడు తారక్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వార్ 2’లో హీరోగా మెరవనున్నాడు.

Also Read: కృష్ణంరాజు నాకు వార్నింగ్ ఇచ్చారు, బాలీవుడ్‌ను చూసి చాలా నేర్చుకున్నాను - కమల్ హాసన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget