అన్వేషించండి

Janakiram Marella: 'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల

Comrade Kalyan Director: ప్రేక్షకుల్ని నవ్వించడంతో పాటు బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్ళు రాబడుతోంది శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన జానకిరామ్ మారెళ్ల సంతోషం వ్యక్తం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ 'కామ్రేడ్ కళ్యాణ్' మంచి వసూళ్లు రాబట్టింది.
  • దర్శకుడిగా జానకిరామ్ మారెళ్ళ తొలి చిత్రం విజయం ఎప్పటికీ గుర్తుంటుందన్నారు.
  • ఆయన కామెడీ, యాక్షన్ సన్నివేశాలను బ్యాలెన్స్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కింగ్‌ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు కథానాయకుడిగా మావోయిస్టు నేపథ్యంలోని కథతో కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కిన సినిమా 'కామ్రేడ్ కళ్యాణ్'. అక్టోబర్ 9న రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని నవ్వించింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టింది. రీసెంట్‌గా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ సినిమాతో జానకి రామ్ మారెళ్ళ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తన తొలి సినిమా విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

తొలి విజయం ఎప్పటికీ గుర్తుంటుంది - జానకిరామ్ మారెళ్ల
'కామ్రేడ్ కళ్యాణ్'తో తనకు మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ రుణపడి ఉంటానని జానకిరామ్ మారెళ్ల తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''తొలి విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ విధంగా నాకు ఈ 'కామ్రేడ్ కళ్యాణ్' కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. కోన వెంకట్ ఎంతో మంది దర్శకులను పరిచయం చేశారు. వారిలో నేనూ ఒకడిని కావడం సంతోషంగా ఉంది. దర్శకుడు నాకు జీవితాన్ని ఇచ్చిన శ్రీవిష్ణు గారు దేవుడితో సమానం'' అని అన్నారు.

Also Read: Spirit New Release Date - దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా

జానకిరామ్ మారెళ్ల కామెడీకి ప్రేక్షకులు ఫిదా!శ్రీవిష్ణుకు సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. వినోదంతో ఆయన ఎన్నో హిట్స్ అందుకున్నారు. అయితే... శ్రీవిష్ణు సినిమాల్లో 'కామ్రేడ్ కళ్యాణ్' కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఇందులో ఆయన కామెడీ కొత్తగా ఉందని ఆడియన్స్ అప్రిషియేట్ చేశారు. ఆ క్రెడిట్ జానకిరామ్ మారెళ్లది అని చెప్పవచ్చు. శ్రీవిష్ణు చేత సింపుల్ వన్‌ లైనర్స్ చెప్పిస్తూ సజహమైన సంభాషణలతో సిట్యువేషనల్ కామెడీ జనరేట్ చేశారు. సాధారణ సన్నివేశాల్లో సున్నితమైన వినోదాన్ని పంచడంలో విజయవంతం అయ్యారు.

Also Read: Nandamuri Mohana Roopa - వేద వేదాంగ విద్యాపీఠంలో వస్త్రాలు పంపిణీ చేసిన నందమూరి వారసురాలు... మోహన రూప కొత్త ఫోటోలు

Janakiram Marella: 'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల

తనలో మంచి కామెడీ రైటింగ్ మాత్రమే కాకుండా... కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్‌ వంటివి కూడా తీయగలనని ఫారెస్ట్ షూట్ అవుట్ సీక్వెన్సుతో జానకి రామ్ మారెళ్ల ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవితో 'కాకా' తెరకెక్కిస్తున్న దర్శకుడు, తన గురువు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) తరహాలో యాక్షన్ సన్నివేశాలను బాగా తీశారు. 'కామ్రేడ్ కళ్యాణ్'తో జానకిరామ్ మారెళ్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ, యాక్షన్... రెండింటినీ బ్యాలెన్స్ చేయడంతో ఆయనతో సినిమా చేయడానికి యంగ్ హీరోలు కొంత మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

Also Read: Anandi's Garividi Lakshmi Biopic Movie Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

'కామ్రేడ్ కళ్యాణ్' సినిమా ఎలా ప్రదర్శన ఇచ్చింది?

అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వించి, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దర్శకుడు జానకి రామ్ మారెళ్ళ తొలి చిత్రంగా ఇది విజయం సాధించింది.

'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో దర్శకుడిగా జానకి రామ్ మారెళ్ళను ఎవరు పరిచయం చేశారు?

కోన వెంకట్ సమర్పణలో 'కామ్రేడ్ కళ్యాణ్' సినిమాతో జానకి రామ్ మారెళ్ళ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తన తొలి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.

'కామ్రేడ్ కళ్యాణ్'లో జానకి రామ్ మారెళ్ళ దర్శకత్వ ప్రత్యేకత ఏమిటి?

శ్రీవిష్ణుతో సహజమైన సంభాషణలతో సిట్యువేషనల్ కామెడీని సృష్టించారు. కామెడీతో పాటు కమర్షియల్ యాక్షన్ సన్నివేశాలనూ సమర్థవంతంగా తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 8 సినిమాలు స్ట్రీమింగ్... ఈ బ్లాక్ బస్టర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 8 సినిమాలు స్ట్రీమింగ్... ఈ బ్లాక్ బస్టర్స్ డోంట్ మిస్
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Vrushakarma Trailer Review : సృష్టి ధర్మాన్ని కాపాడే 'వృషకర్మ' వచ్చేశాడు - ఊహకందని ఊహించని మరో ప్రపంచం... ట్రైలర్ రివ్యూ
సృష్టి ధర్మాన్ని కాపాడే 'వృషకర్మ' వచ్చేశాడు - ఊహకందని ఊహించని మరో ప్రపంచం... ట్రైలర్ రివ్యూ
This Week OTT Releases : నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్
నవంబర్ లాస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - హనుమాన్ అంశ్ To దృశ్యం 3... 21 సినిమాలు స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget