అన్వేషించండి

Hyper Aadi: 24 సీట్లు ఏంటని ప్రశ్నించే హక్కు మనకి ఉందా? పవన్ కళ్యాణ్ డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తా? - హైపర్ ఆది కామెంట్స్

Hyper Aadi : జనసేనకు 24 సీట్లు కేటాయించడంతో పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో హైపర్ ఆది ఈ విషయంపై స్పందించారు.

Comedian Hyper Aadi About Pawan Kalyan : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ వ్యవహారం చర్చనీ అంశంగా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించడంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులే పవన్ కల్యాణ్ ఆలోచన, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ప్రశ్నిస్తూ, పార్టీని వీడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులో కేవలం 24 సీట్లకే పరిమితం కావడం పట్ల జనసైనికులే కాదు పవన్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ని అభిమానించే కమెడియన్ హైపర్ ఆది దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఒక్కసారి ఆలోచించండి

"జనసేనకి 24 సీట్లు అని అనౌన్స్ చేయగానే కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. కొంతమంది అలుగుతున్నారు. ఇంకొంతమంది అసంతృప్తి చెందుతున్నారు మరికొంతమంది అయితే.. భుజంపై మోసిన జెండాని కాలుతో తొక్కి కాలుస్తున్నారు. ఇంకొంతమంది జనసేన స్టిక్కర్స్‌ని తొలగిస్తున్నారు. ఇవన్నీ చూసి నాకు చాలా బాధగా అనిపించింది. ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పండి. తను నమ్ముకున్న ప్రజల్ని కానీ.. తన వెంట నడుస్తున్న ప్రజల్ని మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌గారికి ఉంటుందా? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే.. పార్టీ పెట్టిన వ్యక్తి ఎంత ఆలోచిస్తాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయన తనలో తాను ఎంత మదనపడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి" అని అన్నారు.

పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు మనకుందా?

"పదేళ్లుగా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా.. తన కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధగా ఉంది. 24 సీట్లే ఏంటి? అని అడుగుతున్న మనం.. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ గారిని కూడా గెలిపించలేదు. కానీ ఇప్పుడు 24 సీట్లు ఏంటని ప్రశ్నించే హక్కు మనకి ఉందా? చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే మనం ఇంట్లో నుంచి బయటకు రాలేం. కానీ ఆయన రెండుచోట్ల ఓడిపోయినా కూడా.. రెండో రోజే ప్రజా సమస్య అనగానే పరుగుపెట్టుకుని వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ గారు. తన పిల్లల కోసం బ్యాంక్‌లో దాచిన డబ్బుని తీసి.. కౌలు రైతులకు సాయం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు మనకి ఉందా?" అని ప్రశ్నించారు

పవన్ కళ్యాణ్ నిజంగా డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తేనా?

"రోజుకి రెండు కోట్లు తీసుకునే ఆయన.. సంపాదించినది అంతా ప్రజలకే పెట్టేస్తున్నారు. దేశ రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు.. కానీ పవన్ కళ్యాణ్‌ గారిలా సాయం చేసింది ఎవరైనా ఉన్నారా? దేశ రాజకీయాల్లో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని కులాన్ని తాకట్టు పెట్టాడు.. పార్టీని తాకట్టు పెట్టాడు.. ప్యాకేజ్ తీసుకున్నాడని చాలా ఈజీగా అనేస్తున్నాం. అమ్మ లాంటి కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ డబ్బుకి అమ్ముడైపోతారా? నిజంగా అమ్ముడయ్యే వ్యక్తి అయితే.. ప్రతిపక్షానికి ఎందుకు అమ్ముడవుతాడు... అధికార పార్టీ దగ్గరే డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పార్టీకి అమ్ముడయ్యేవాడు కదా. ఎందుకండీ ఈ మాటలు" అంటూ తన ఆవేదన వ్యక్తంచేశారు.

Also Read : రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో దర్శకుడు క్రిష్ - ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు

టాప్ హెడ్ లైన్స్

Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Irumudi First Day Collections : మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget