Itlu Maredumilli Prajaneekam First Look: ఇట్లు 'అల్లరి' నరేష్ హీరోగా నటిస్తున్న 'మారేడుమిల్లి ప్రజానీకం' ఫస్ట్ లుక్ వచ్చిందహో
అల్లరి నరేష్ కథానాయకుడిగా జీ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై రూపొందుతోన్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ రోజు విడుదల చేశారు.
ఎటువంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల ఈతరం కథానాయకుల్లో 'అల్లరి' నరేష్ ఒకరు. ఆయన కామెడీ సినిమాలు చేస్తారు. 'విశాఖ ఎక్స్‌ప్రెస్', 'గమ్యం', 'నాంది' వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ విలక్షణ పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి వైవిధ్యమైన కథ, పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
'అల్లరి' నరేష్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆయన 59వ చిత్రమిది. ఇందులో ఆనంది హీరోయిన్. 'సోలో బ్రతుకే సో బెటర్', 'రిపబ్లిక్', 'బంగార్రాజు' విజయాల తర్వాత జీ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రమిది. జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకుడు.
ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. తలకు, చేతికి గాయాలతో ఓ మంచాన్ని మోసుకు వెళుతూ నరేష్ కనిపించారు. ఆయన కళ్ళలో ఒక ఇంటెన్స్ ఉంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం తెలియజేసింది.
Also Read: 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్
'వెన్నెల' కిశోర్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్: పృథ్వీ, సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి, ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి.
Also Read: మహేష్ కుమార్తె డ్రీమ్ ఏంటో తెలుసా? క్లారిటీగా చెప్పిన సితార
View this post on Instagram