అన్వేషించండి

Prabhas Rajasabh Remuneration: ''రాజాసాబ్'కి రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్న ప్ర‌భాస్?

Prabhas Rajasabh Remuneration: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్.. త‌న రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్నార‌ట‌. 'రాజాసాబ్' సినిమాకి ఆయ‌న రెమ్యున‌రేష‌న్ త‌క్కువ తీసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Prabhas taking lesser remuneration for Rajasabh Movie?:  పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ 'క‌ల్కీ 2898 ఏడి' సినిమా సూప‌ర్ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ త‌ర్వాత కూడా ఆయ‌న వరుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్ష‌న్ లో 'రాజాసాబ్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు ప్ర‌భాస్. అయితే ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. అదే ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ కి సంబంధించి. 

రెమ్యున‌రేష‌న్ త‌క్కువ తీసుకుంటున్నార‌ట‌?

ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకున్నారా? ఆయ‌న 'రాజాసాబ్'కి  రెమ్యున‌రేష‌న్ త‌క్కువ తీసుకుంటున్నారా? అంటే అవున‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమాకి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ కంటే ఈ సినిమాకి త‌క్కువ‌గా తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అంతేకాదు రెమ్యున‌రేష‌న్ ఎంత‌ డిమాండ్ చేశారు? ఎంత త‌గ్గించుకున్నారు అనే విష‌యం కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్ర‌భాస్ న‌టించిన ‘ఆదిపురుష్’ సినిమాని నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాని కూడా నిర్మిస్తోంది.

2025లో రిలీజ్.. 

ఇక 'రాజాసాబ్' సినిమాని 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. దానికి సంబంధించి షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కామెడీ జోన‌ర్ లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్ర‌భాస్ స‌ర‌స‌న మాల‌విక మోహ‌న‌, నిధి అగ‌ర్వాల్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌భాస్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్ర‌భాస్ లుంగీ క‌ట్టుకుని న‌డుస్తున్న ఫ‌స్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ మాస్, కామెడీ సినిమా అని కామెంట్లు పెడుతున్నారు.  

'క‌ల్కీ 2898 ఏడీ'తో.. 

'బాహుబ‌లి', 'బాహుబ‌లి - 2' సినిమాల‌తో పాన్ ఇండియా స్టార్ గా మారారు ప్ర‌భాస్. ఆయ‌న క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. కానీ, ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు నిరాశ‌నే మిగిల్చాయి. 2023లో వ‌చ్చిన ‘స‌లార్’ సినిమా హిట్ తో ఖుషీలో ఉన్నారు ఆయ‌న ఫ్యాన్స్. ఇక ఇప్పుడు 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో పండ‌గ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమా భారీ రికార్డులు న‌మోదు చేసింది. క‌లెక్ష‌న్ల‌లో దూసుకుపోయిన విష‌యం తెలిసిందే. ఇక ఆ సినిమాలో ప్ర‌భాస్, దిపికా ప‌దుకొణే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. 

ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో వ‌రుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 'రాజాసాబ్', 'యానిమ‌ల్' ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో 'స్పిరిట్' చేస్తున్నారు. కాగా.. 'క‌ల్కీ 2898 ఏడీ' సినిమాకి పార్ట్ - 2 కూడా ఉంది. త్వరలోనే ఆ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే - పొట్టి డ్రెస్‌లో అందాల ఆరబోతపై అమలా పాల్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

The Paradise : మీరు విగ్గు పెట్టుకుని చెప్తే మేము ఎలా వింటాం? - మహిళా జర్నలిస్ట్ కౌంటర్‌కు నాని స్పాంటేనియస్ రియాక్షన్
మీరు విగ్గు పెట్టుకుని చెప్తే మేము ఎలా వింటాం? - మహిళా జర్నలిస్ట్ కౌంటర్‌కు నాని స్పాంటేనియస్ రియాక్షన్
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
Horror Thriller OTT : రెండు ఓటీటీల్లో మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - జబర్దస్త్ అదిరే అభి మూవీ ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - జబర్దస్త్ అదిరే అభి మూవీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Secret Wedding Misfires: విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
విజయవాడ కనకదుర్గ గుడిలో పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు.. న్యాయం కోసం మహిళ ఆవేదన
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget