Sneha: నా భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడు - అందుకే, కలిసి ఉంటున్నాం: నటి స్నేహ
Sneha: స్నేహ.. ఎన్నో మంచి క్యారెక్టర్లు చేసి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగతున్నారు. తన భర్త లవ్ బ్రేకప్ గురించి ఇంటర్వ్యూలో చెప్పారు.
Heroine Sneha Reveals About His Husband Past Love Story: యాక్టరస్ స్నేహ.. పరిచయం అక్కర్లేని పేరు. అందంలో ఆమెను అందరూ ఇలనాటి సావిత్రి అంటారు. పదహారనాళ్ల తెలుగు అమ్మాయిలా.. కట్టు బొట్టుతో లక్షలాది మంది మనసును దోచారు స్నేహ. 'ప్రియమైన నీకు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు స్నేహ. ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మధ్యే చీరాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన స్నేహ రిలేషన్ షిప్ గురించి, తన భర్త గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. తన భర్తకు లవ్ బ్రేకప్ ఉందని చెప్పుకొచ్చారు.
రిలేషన్ షిప్‌లో నమ్మకం ఉండాలి..
తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో ప్రసన్నని పెళ్లి చేసుకున్నారు స్నేహ. వాళ్లిద్దరిది ప్రేమ పెళ్లి. వాళ్లకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వాళ్లిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. తన భర్తకు పాస్ట్ లో లవ్ స్టోరీ ఉందని, అయినా కలిసి ఉంటున్నాం అని అన్నారు ఆమె. ఈ నేపథ్యంలో స్నేహ రిలేషన్ షిప్ గురించి, నమ్మకం గురించి చెప్పారు. "భార్యభర్త మధ్య పొసెసివ్‌నెస్ అనే భావం ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. పొసెసివ్ నెస్ ఎక్కువగా ఉంటే.. నమ్మకం కుదరదు. పదే పదే "ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు?" అనే ప్రశ్నలు పార్టనర్స్ మధ్య వస్తే.. మనస్పర్థలు వస్తాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడదు. అలా కాకుండా.. "ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎప్పుడు వస్తారు" లాంటివి ముందే డిస్కస్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మన భాగస్వామి ఎక్కడికైనా వెళ్తే తిన్నాడా? లేదా? ఎలా ఉన్నాడో కేర్ తీసుకుంటే ఇద్దరి మధ్య బాండ్ పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇద్దరి మధ్య బంధాన్ని స్ట్రాంగ్ చేస్తాయి. పెళ్లైన కొత్తలో నేను చాలా పొసెసివ్ గా ఉన్నాను. కానీ, అది నా భర్త మీద నమ్మకం లేకపోవడం ఏ మాత్రం కాదు. నా భర్తకు గతంలో లవ్ స్టోరీ ఉంది. అది బ్రేకప్ అయిపోయింది. అది నాకు ఇబ్బంది కాదు కాబట్టి.. నేను ఆయన కలిసి ఉన్నాం" అంటూ క్లారిఫికేషన్ ఇచ్చారు స్నేహ.
ప్రేమ పెళ్లి..
2001లో తన సినిమా కెరీర్ ప్రారంభించారు స్నేహ. 'ప్రియమైన నీకు' సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక ఆ తర్వాత ఆ తర్వాత 'హనుమాన్ జంక్షన్', 'వెంకీ', 'సంక్రాంతి', 'రాధాగోపాలం 'తదితర హిట్ సినిమాలు చేశారు. చక్కటి కట్టుబొట్టుతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ఆ తర్వాత 2009లో ఆమె ‘అచాముండు అచాముండు’ అనే తమిళ సినిమాలో ప్రసన్నతో కలిసి నటించారు. ఆ టైంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా.. 2012లో ఇద్దరు పెళ్లి చేసుకోగా.. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత స్నేహ కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశారు.
Also Read: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం