Hari Hara Veera Mallu: తిరుపతిలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్... పవన్ షెడ్యూల్ ఫిక్స్... ఇదిగో ఈవెంట్ డేట్
Hari Hara Veera Mallu Pre Release Event: తిరుపతిలో 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆ వేడుకలో ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇంతకీ తిరుపతిలో ఈవెంట్ ఎప్పుడో తెలుసా?

వీరమల్లు ఫీవర్ మొదలైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) విడుదలకు ఇంకెంతో సమయం లేదు. జూన్ 12న థియేటర్లలోకి సినిమా రానుంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారు? అంటే...
తిరుపతిలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్!
HHVM Pre Release Event: ఏడు కొండల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలోని తారకరామ స్టేడియంలో 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఆయనతో పాటు చిత్ర బృందం కూడా పాల్గొంటారు. ప్రస్తుతం 'దే కాల్ హిమ్ ఓజీ' షూటింగ్ కోసం పవన్ ముంబైలో ఉన్నారు. వీరమల్లు ప్రీ రిలీజ్ కోసం వీకెండ్ ఇటు వస్తారు. ఆల్రెడీ ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయినట్టు సమాచారం అందింది.
Hari Hara Veera Mallu Trailer Release Date: 'హరి హర వీరమల్లు' సినిమా నుంచి ఇప్పటి వరకు నాలుగు పాటలు విడుదల అయ్యాయి. ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి అందించిన బాణీలకు మంచి స్పందన లభిస్తోంది. మరి ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారు? అంటే... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
Also Read: రాజేంద్ర ప్రసాద్‌ను క్షమించిన అలీ... పుట్టెడు దుఃఖంలో ఉన్నారు... వదిలేయండి!
సనాతన ధర్మం నేపథ్యంలో వీరమల్లు
మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో 'హరి హర వీరమల్లు' రూపొందిన సంగతి తెలిసిందే. అప్పట్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ హైలైట్ అవుతుందని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. క్రిష్ జాగర్లమూడి నుంచి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన జ్యోతి కృష్ణ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ
#HariHaraVeeraMallu storms past 200K+ interests on @bookmyshow ⚔️🔥
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 2, 2025
The Battle for Dharma is about to set the screens on fire! 🔥💥#HHVM grand release worldwide this JUNE 12th! 🏹#HHVMonJune12th #DharmaBattle #VeeraMallu
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol… pic.twitter.com/Tu8ViGvRxz
'హరి హర వీరమల్లు' చిత్రీకరణ అంతా పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కేవలం నాలుగు గంటలలో పూర్తి చేశారు. విజువల్ ఎఫెక్ట్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. రెండు మూడు రోజులలో సెన్సార్ పూర్తి చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.





















