అన్వేషించండి

Adipurush: ‘ఆదిపురుష్’ థియేటర్లోకి వచ్చిన వానరం - హనుమంతుడే వచ్చాడంటూ పూజలు!

‘ఆదిపురుష్’ సినిమా విడుదల అయిన అన్ని థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఓ థియేటర్ లోకి నిజంగానే ఓ వానరం ‘ఆదిపురుష్’ సినిమా చూడటానికి వచ్చింది. ఇప్పుడా వీడియో...

Adipurush: ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓమ్ రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా నేడు(జూన్ 16) గ్రాండ్ గా రిలీజ్ అయింది. నిన్నటి నుంచే థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. కొన్ని ఏరియాల్లో తెల్లవారుజాము నుంచే షో లు మొదలైపోయాయి. రామాయణ దృశ్య కావ్యాన్ని ఇప్పటి విజువల్ ఎఫెక్ట్స్ తో చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమా విడుదల అయిన అన్ని థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. రామాయణం నాటకం ఎక్కడ జరిగినా హనుమంతుడు వచ్చి చూస్తాడనే నమ్మకంతో మూవీ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఓ థియేటర్ లోకి నిజంగానే ఓ వానరం ‘ఆదిపురుష్’ సినిమా చూడటానికి వచ్చింది. ఆ సన్నివేశాన్ని థియేటర్ లో ఉన్న ప్రేక్షకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

‘ఆదిపురుష్’ థియేటర్ లోకి వానరం-జై శ్రీరామ్ అంటూ నినాదాలు ప్రేక్షకులు..

‘ఆదిపురుష్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా చూసేందుకు ప్రేక్షకులు నిన్నటి నుంచే థియేటర్ల వద్ద క్యూలు కట్టారు. మొదటి రోజు కొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచే షో లు మొదలైయ్యాయి. ఏ థియేటర్ లో చూసినా ప్రేక్షకులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. హనుమంతుడి కోసం ప్రతీ థియేటర్లో ఒక సీటు వదిలేశారు. అయితే ‘ఆదిపురుష్’ సినిమా రన్ అవుతుండగా ఓ వానరం థియేటర్ లోకి వచ్చింది. కాసేపు సినిమాను చూసి వెళ్లిపోయింది. దీంతో ప్రేక్షకులు ఆ వానరాన్ని చూసి జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సాక్ష్యాత్తూ హనుమంతుడే రామయణాన్ని చూడటానికి వచ్చాడు అంటూ ఆ వానరానికి చేతులెత్తి మొక్కారు. ఇదంతా థియేటర్ లోని ప్రేక్షకులు వీడియో తీశారు. వానరం కనిపించినంతసేపు ఆ థియేటర్ మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోపై నెటిజన్స్ కూడా స్పందిస్తూ జైశ్రీరామ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

థియేటర్లలో హనుమాన్ విగ్రహం, పూజలు..

‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ఒక సీటును హనుమాన్ కోసం కేటాయించాలని దర్శకుడు ఓమ్ రౌత్ కోరిన తర్వాత ఈ సినిమాపై బజ్ బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే టికెట్ ల విక్రయాల జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు హనుమాన్ కోసం ఉంచిన సీటు గురించి మరో వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే.. కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు హనుమాన్ కోసం కేటాయించిన సీటును అలా ఖాళీగా వదిలేయకుండా ఆ సీటులో హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ను ఉంచాలని భావించారు. అలాగే కొన్ని చోట్ల ఖాలీ సీట్లలో హనుమాన్ ఫోటోను లేదా విగ్రహాన్ని ఉంచుతున్నారు. అంతే కాదు పూలతో హనుమంతునికి పూజలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా థియేటర్ లోకి వానరం రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే రామాయణం ఎక్కడ జరిగినా అక్కడకు హనుమ వస్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్ లోకి వానరం రావడం, సినిమా చూడటం ఆశ్చర్యం కలిగించే విషయమనే చెప్పాలి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read: 'ఆదిపురుష్' రివ్యూ : రామాయణానికి మోడ్రన్ టచ్ - ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget