అన్వేషించండి

Hanuman Ansh Telugu Release Date : సాధారణ బాలుడి ప్రయాణం... మదర్ To గాడ్ - అసలేంటీ హనుమాన్ అంశ్ స్టోరీ?... త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో...

Hanuman Ansh Story : 2 కోట్ల బడ్జెట్... 150 కోట్ల కలెక్షన్స్. తల్లిని వెతుక్కుంటూ వెళ్లిన ఓ యువకుడి కథ. ఇప్పుడు తెలుగులోనూ రాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

Trivikram Srinivas Presenting Hanuman Ansh Telugu Movie : గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీ మొత్తం ఒకే మూవీ గురించి మాట్లాడుకుంటుంది. కేవలం 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఓ సెన్సేషన్. చిన్న సినిమాగా విడుదలై ఎవరి ఊహాలకు అందని రీతిలో బిగ్ సక్సెస్ అందుకున్న మూవీ హనుమాన్ అంశ్ (Hanuman Ansh). 

త్రివిక్రమ్ సమర్పణలో...

ఇప్పుడు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సమర్పణలో సెప్టెంబర్ 18న (శుక్రవారం) తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇది ఓ ఆధ్యాత్మిక బయోగ్రాఫికల్ డ్రామా. ఆగస్ట్ 7న హిందీలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని సక్సెస్ అందుకుంది. అసలు ఈ మూవీ ఎందుకంత పాపులర్... అసలేంటీ స్టోరీ అనేది ఓసారి చూస్తే...

1900 - 1973 మధ్య కాలంలో జీవించిన ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవిత కథ, ఆయన చేసిన బోధనల ఆధారంగా విశాల్ చతుర్వేది 'హనుమాన్ అంశ్' రూపొందించారు. మూవీలో శోభిత్ శ్రీవాత్సవ ప్రధాన పాత్ర పోషించగా చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి తదితరులు కీలకపాత్రల్లో పోషించారు. రాగిణి సోనా, నమ్రతా జి. సింగ్, అనుప్రియా నగర్, డా. విశాల్ చతుర్వేది నిర్మించారు. 'డివైన్ డిటూర్' అనే బుక్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.

నీమ్ కరోలి బాబా జీవిత కథ

నీమ్ కరోలి బాబాను లక్ష్మణ్ నారాయణ్ శర్మ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని అక్బర్‌పూర్ ప్రాంతంలో జన్మించిన ఈయన... చిన్న వయసులోనే... ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. 'మనిషి ఎందుకు పుడతాడు?', 'మరణం అంటే ఏమిటి?', 'మనిషి ఎందుకు బాధపడతాడు?', 'ఈ జీవితానికి అసలు అర్థం ఏమిటి?' లాంటి ప్రశ్నలు మొదలవుతాయి.

అసలు ఆయనకు 'నీమ్ కరోలి బాబా' అనే పేరు ఎందుకు వచ్చింది? బాబా జీవితంతో అత్యంత అనుబంధం ఉన్న ప్రదేశం కైన్చీ ధామ్ (Kainchi Dham), ఉత్తరాఖండ్. 1964లో అక్కడ ఆశ్రమం, హనుమాన్ ఆలయం ఏర్పడింది. తర్వాత కైన్చీ ధామ్ ఆయన భక్తులకు ప్రముఖ కేంద్రంగా మారింది. యాపిల్ సంస్థల అధినేత స్టీవ్ జాబ్స్, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ లాంటి వ్యక్తులు ఆయన్ను కలవడం ప్రపంచవ్యాప్తంగా బాబా పేరు మరింత ప్రసిద్ధి చెందింది.

Also Read : The Paradise Story : అందుకే ట్రైలర్ రిలీజ్ చేయడం లేదు - తల్లీ కొడుకుల ఎమోషనల్ స్టోరీ ది ప్యారడైజ్

అసలెందుకు చూడాలి... స్టోరీ ఏంటి?

అమ్మకోసం అన్వేషణ - ఈ మూవీ స్టోరీ అప్పటి స్వతంత్ర భారతంలో స్టార్ట్ అవుతుంది. లక్ష్మీ నారాయణ్ శర్మ (నీమ్ కరోలి బాబా) అనే చిన్న బాలుడు చిన్నప్పుడే తన తల్లి మరణించడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు. భగవంతుడిని గుర్తిస్తేనే మళ్లీ తన అమ్మను తాను చూడగలననే బలమైన నమ్మకంతో అప్పుడే ఇల్లు వదిలి అమ్మ, దేవుని కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు.

డివోషనల్ జర్నీ - దేవుడిని వెతుకుతూ ఆ బాలుడు చేసే ప్రయాణంలో ఉత్తర భారతదేశంలోని ఎన్నో ఆలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అడవులు, నదులు, ఆధ్యాత్మిక నగరాల్లో తిరుగుతాడు. కఠిన నియమాలు పాటిస్తూ భక్తితో బంధాలన్నీ వదిలేస్తాడు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకుంటే ఆయనే తనను శ్రీరాముడి దగ్గరకు చేరుస్తాడని నమ్ముతాడు.

మానవ సేవే మాధవ సేవ - దేవుడు ఎక్కడో లేడని... ఇతరులకు సాయం చేయాలనే మంచి మనసులోనే ఉన్నాడని తెలుసుకుంటాడు. మానవ సేవే మాధవ సేవ అని గుర్తిస్తాడు.

బాబాగా మార్పు - అలా మానవ సేవలో పరమార్థం తెలుసుకున్న ఆ బాలుడు ఆ తర్వాత నీమ్ కరోలి బాబాగా మారతాడు. 'అందరినీ ప్రేమించు... అందరికీ అన్నం పెట్టు. ఎల్లప్పుడూ రామున్ని స్మరించు' అనే నినాదంతో ప్రజలకు ఆధ్యాత్మిక బోదనలు చేస్తాడు. అలా బాబా మహిమల వల్ల ప్రజలు ఆయన్ను 'హనుమాన్ అంశ్'గా కొలుస్తారు. మరి ఈ విశేషాలన్నీ సినిమాలో మీరు చూడొచ్చు.

Also Read : Crime Thriller OTT : అనాథల మిస్టీరియస్ మర్డర్స్ వెనుక ఉన్నది ఎవరు? - ట్రెండింగ్‌లో ఉదయ భాను థ్రిల్లర్ సిరీస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hanuman Ansh OTT : మూడు ఓటీటీల్లోకి హనుమాన్ అంశ్ - బ్లాక్ బస్టర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
మూడు ఓటీటీల్లోకి హనుమాన్ అంశ్ - బ్లాక్ బస్టర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
Sharwanand Dimple Hayathi : శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Embed widget