అన్వేషించండి

బాలీవుడ్ హీరోల వల్ల కాదు, ఎన్‌టీఆర్‌కే సాధ్యం: ‘గదర్ 2’ డైరెక్టర్ కామెంట్స్

తాజాగా ‘గదర్ 2’ డైరెక్టర్ అనిల్ శర్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తెలుగు హీరో అయిన ఎన్‌టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

క్కొక్కసారి బాక్సాఫీస్ వద్ద నాలుగు పెద్ద చిత్రాలు ఒకేసారి విడుదల అయినా కూడా అన్ని సినిమాలు ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటాయి, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతాయి. అలా ఒకేసారి పలు చిత్రాలు విడులదయినప్పుడు థియేటర్ల విషయంలో, కలెక్షన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం అన్నింటికి ఒకే రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయి. తాజాగా ‘గదర్ 2’ విషయంలో కూడా అదే జరిగింది. ‘గదర్ 2’కు పోటీగా మరో మూడు పెద్ద సినిమాలు ఉన్నా కూడా వాటన్నింటికి సమానంగా ఈ మూవీ కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాజాగా ‘గదర్ 2’ డైరెక్టర్ అనిల్ శర్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తెలుగు హీరో అయిన ఎన్‌టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘గదర్’ డైరెక్టర్ కామెంట్స్

22 ఏళ్ల క్రితం విడుదలయిన ‘గదర్’.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు దాని సీక్వెల్‌గా తెరకెక్కిన ‘గదర్ 2’ కూడా అలాంటి సెన్సేషన్నే సృష్టిస్తూ ముందుకెళ్తోంది. 20 రోజులు అవుతున్నా కూడా ఇంకా ఈ మూవీ చూడడం కోసం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తూనే ఉన్నారు. ఇప్పటికే కేవలం ఇండియన్ బాక్సాఫీస్‌లోనే ఈ చిత్రం రూ.480 కోట్ల వసూళ్లను సాధించింది. దీన్ని బట్టి చూస్తే సన్నీ డియోల్, అమీషా పటేల్ కలిసి నటించిన ‘గదర్ 2’ ఎంత ప్రేక్షకాధరణ పొందుతుందో అర్థమవుతోంది. ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ శర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఎన్‌టీఆర్ పేరు ప్రస్తావించడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఎన్‌టీఆర్‌కే సాధ్యం

‘గదర్’లో సన్నీ డియోల్.. తారా సింగ్ పాత్రను పోషించాడు. అయితే ఈతరం హీరోల్లో ఎవరు తారా సింగ్ పాత్రను పోషిస్తే బాగుంటుంది అంటూ అనిల్ శర్మకు ప్రశ్న ఎదురయ్యింది. అయితే అనిల్ శర్మ.. బాలీవుడ్ హీరోలలో ఎవరి పేరు చెప్పకుండా తెలుగు హీరో అయిన ఎన్‌టీఆర్ పేరు చెప్పారు. బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌ను ఏ యంగ్ హీరో మ్యాచ్ చేయలేడు అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అనిల్ శర్మ లాంటి డైరెక్టర్ నుండి ఇలాంటి ప్రశంసను అందుకోవడం గ్రేట్ అంటూ ఇండస్ట్రీ నిపుణులు ఎన్‌టీఆర్‌ను ప్రశంసిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎంతోమంది బాలీవుడ్ దర్శకులు ఎన్‌టీఆర్ గురించి, ఎన్‌టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ఓపెన్‌గా ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి అనిల్ శర్మ కూడా చేరారు.

‘దేవర’తో బిజీ

ప్రస్తుతం ఎన్‌టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 2024లో ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ‘దేవర’పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన ఫస్ట్ లుక్, క్యాస్టింగ్ వివరాలు అన్ని ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ఉన్నాయి. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ సైలెంట్‌గా కొనసాగుతోంది. ఈ మూవీ నుండి తరువాతి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ లాంటి హిట్ ఉండడంతో ‘దేవర’.. అంతకు మించిన హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ - 7‌లోకి షకీలా‌తోపాటు మరో ఐటెమ్ బాంబు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget